English | Telugu

నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో ఆరవ వారం నయని పావని ఎలిమినేట్ అయి బయకొచ్చింది. పోటుగాళ్ళుగా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్, అశ్విని, నయని, పూజా మూర్తి, భోలే శావలి నుండి నయని పావని ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన నయని మోస్ట్ ఎమోషనల్ అయింది. ‌ఇక నాగార్జున తన జర్నీ వీడియో చూపించి, తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడించాడు. ఇక ఒక్కో హౌస్ మేట్ గురించి మాట్లాడుతూ నయని ఏమోషనల్ అయిన విషయం తెలిసిందే.

హౌస్ లోని వాళ్ళంతా తనతో ఎలా ఉన్నారో చెప్పుకుంటూ ఏడ్చేసిన నయనిని చూసి ప్రేక్షకులకి గీతు రాయల్ గుర్తొచ్చింది. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడమేంటని చర్చ జరుగుతోంది. అయితే ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకొచ్చి‌న నయాని అందరి గురించి కొన్ని విషయాలు మాట్లాడింది. శివాజీ గురించి మాట్లాడుతూ చాలా ఏడ్చేసింది నయని. "శివాజీ గారిని చూడగానే నాకు మా నాన్నే గుర్తొచ్చాడు సర్. రోజు పొద్దున్నే వెళ్ళి డాడీకి హగ్ ఇచ్చి నా డే స్టార్ట్ చేస్తాను సర్" అని నాగార్జునతో నయని అంది‌. ఐ మిస్ యూ డాడీ అని శివాజీతో నయని అనగానే శివాజీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక శివాజీ ఎమోషనల్ అవుతూ.‌. " నాకు కూతురు లేదు సర్. తనలో నేను కూతురిని చూసుకున్నాను. నన్నే డాడీ అనుకో అని తనతో చెప్పాను. సర్ తన బదులు నేను బయటకు రావొచ్చా సర్. నాకు చేయి నొప్పి కూడా ఉంది " అంటూ శివాజీ ఎమోషనల్ గా చెప్పగా.. ఆడియన్స్ ఓటింగ్ ని మనం మార్చలేం కదా శివాజీ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత నయని పావని ఎలిమినేషన్ అయి బయటకి వెళ్లింది. ఇక నాగార్జున చూసి ఒక కంటెస్టెంట్స్ బయటకు వెళ్తుంటే ఇంతమంది బాధపడటం ఫస్ట్ టైమ్ చూస్తున్నానని నాగార్జున అన్నాడు.

నయని పావని హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా యాక్టివ్ గా ఉండేది. అందరితో కలిసి ఉండేది‌. మరి హౌస్ లో తనకి రోజుకు ముప్పై వేల చొప్పున వారానికి ఒక లక్ష రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బయట వినిపిస్తుంది. అయితే తన ఎలిమినేషన్ మాత్రం అన్ ఫెయిర్ అంటు సోషల్ మీడియాలో ఒక మినీ ట్రెండ్ సాగుతుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.