పాత ప్రియులంతా ప్రియాంక దృష్టిలో 'వండర్ఫుల్ మెన్'!
ఎవరికైనా తొలిప్రేమ, తొలి ముద్దు జ్ఞాపకాలు మధురంగానే ఉంటాయి. నిజానికి తొలిసారి ప్రేమలో పడినప్పుడు ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది. తన జీవితం పూర్తిగా మారిపోయిందనే అనుభూతి కలుగుతుంది. అదే, తొలిప్రేమను కోల్పోయినప్పుడు పడే వేదన కూడా మాటలకు అందనిది. మన జీవితం ముడిపడి ఉన్న వ్యక్తిని కలుసుకొనే దాకా, మనం ఎంతో దూరం ప్రయాణించాల్సి రావచ్చు.