Read more!

English | Telugu

ర‌ణ‌బీర్ క‌పూర్‌కు క‌రోనా.. క్వారంటైన్‌లో అలియా!

 

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాడు. ఈ విష‌యాన్ని అత‌ని త‌ల్లి నీతూ క‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ధ్రువీక‌రించారు. ర‌ణ‌బీర్ పిక్చ‌ర్‌ను షేర్ చేసిన ఆమె, అత‌ను హోమ్ క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు తెలిపారు.

రణ‌బీర్ ఆరోగ్యాన్ని కోరుకుంటూ విషెస్ తెలియ‌జేస్తున్న ఫ్యాన్స్‌కు త‌న పోస్ట్‌లో థాంక్స్ చెప్పారు నీతూ. "ర‌ణ‌బీర్ కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాడు. అత‌ని విష‌యంలో శ్ర‌ద్ధ చూపిస్తూ, గుడ్ విషెస్ తెలియ‌జేస్తున్న మీకు ధ‌న్య‌వాదాలు. అత‌ను చికిత్స తీసుకుంటున్నాడు, బాగా కోలుకుంటున్నాడు. ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న ర‌ణ‌బీర్ అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నాడు." అని ఆమె పోస్ట్ చేశారు.

ర‌ణ‌బీర్ త‌ర్వాత డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటు ర‌ణ‌బీర్‌, అటు భ‌న్సాలీ కొవిడ్ బారిన ప‌డ‌టంతో అలియా భ‌ట్ సైతం త‌నంత‌ట తాను సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లింది. భ‌న్సాలీతో క‌లిసి ఆమె 'గంగుబాయ్ క‌థియ‌వాడి' షూటింగ్‌లో పాల్గొంటోంది. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

గ‌తంలో ర‌ణ‌బీర్ త‌ల్లి నీతూ క‌పూర్‌కు సైతం క‌రోనా సోక‌డం గ‌మ‌నార్హం. 'జుగ్ జుగ్ జీయో' షూటింగ్‌లో పాల్గొంటూ గ‌త డిసెంబ‌ర్‌లో ఆమె క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే త్వ‌ర‌గానే ఆమె కోలుకున్నారు.