Read more!

English | Telugu

ఐదేళ్ల‌కు వేధింపులు, తొమ్మిదేళ్ల‌కు అత్యాచారం.. స‌ల్మాన్ మాజీ ప్రేయ‌సి సంచ‌ల‌నం!

 

లేటెస్ట్‌గా ఇచ్చిన ఒక వీడియో ఇంట‌ర్వ్యూలో స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రేయ‌సి సోమీ అలీ వెల్ల‌డించిన విష‌యాలు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి. ఐదేళ్ల వ‌య‌సులో వేధింపుల‌కు గుర‌య్యాన‌నీ, తొమ్మిదేళ్ల వ‌య‌సులో, తిరిగి 14 ఏళ్ల వ‌య‌సులో అత్యాచారానికి గుర‌య్యాన‌నీ ఆమె వెల్ల‌డించింది.

స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, పాకిస్తాన్‌లో జ‌న్మించిన అమెరిక‌న్ న‌టి సోమీ అలీ 1990ల‌లో బాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేసింది. ఎక్కువ కాలం న‌టిగా కొన‌సాగ‌ని ఆమె, ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్పిన ప్ర‌స్తుతం ఫ్లోరిడాలో 'నో మోర్ టియ‌ర్స్' అనే నాన్‌-ప్రాఫిట్ ఆర్గనైజేష‌న్‌ను న‌డుపుతోంది. త‌న ఎన్జీవో ద్వారా, లైంగిక వేధింపుల‌కు గురైన బాల‌ల‌ను, అత్యాచార బాధితుల‌ను కాపాడేందుకు కృషి చేస్తోంది. ఇన్నాళ్ల‌కు తాను స్వ‌యంగా అత్యాచార బాధితురాలిన‌ని ఆమె వెల్ల‌డించ‌డం అంద‌ర్నీ షాక్‌కు గురిచేసింది.  ఐదేళ్ల వ‌య‌సులోనే తాను తొలిసారిగా లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాన‌నీ, తొమ్మిదేళ్ల‌కు, ఆ త‌ర్వాత మ‌రోసారి ప‌ద్నాలుగేళ్ల‌కు త‌న‌పై అత్యాచారం జ‌రిగింద‌నీ ఆమె వీడియో ఇంట‌ర్వ్యూలో తెలిపింది.

"పాకిస్తాన్‌లో నేను మొద‌టిసారి లైంగిక వేధింపుల‌కు గురైన‌ప్పుడు నా వ‌య‌సు ఐదేళ్లు. స‌ర్వెంట్ క్వార్ట‌ర్స్‌లో మూడు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. నేనా మా అమ్మానాన్న‌ల‌తో చెప్ప‌డంతో, చ‌ర్య‌లు తీసుకున్నారు. కానీ వారు నాతో ఈ విష‌యాన్ని ఎవ‌రితోనూ చెప్ప‌వ‌ద్ద‌ని చెప్పారు. ఆ విష‌యాన్ని నా త‌ల‌లో సంవ‌త్స‌రాల పాటు పెట్టుకుని గ‌డిపాను. నేనేదైనా త‌ప్పు చేశానా? అమ్మానాన్న‌లు అలా ఎందుకు చెప్పారు?.. అని ఆలోచించాను. పాకిస్తాన్‌, ఇండియా సంస్కృతులు ఇమేజ్ మీద ఆధార‌ప‌డి ఉంటాయి. అవి న‌న్ను కాపాడుతున్నాయి కానీ దాన్ని నేను అర్థం చేసుకోలేదు. తొమ్మిదేళ్ల‌కు ఓసారి, 14 ఏళ్ల‌కు ఇంకోసారి అలాంటి ఘ‌ట‌న‌ల‌నే ఎదుర్కొన్నాను." అని చెప్పుకొచ్చింది సోమీ అలీ.
 
1992లో 'ఖిలాడి' మూవీలో దీపిక్ తిజోరి జోడీగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోమీ, ఆ త‌ర్వాత సునీల్ శెట్టి, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, సైఫ్ అలీఖాన్‌, సంజ‌య్ ద‌త్ లాంటి న‌టుల స‌ర‌స‌న న‌టించింది. స‌ల్మాన్ ఖాన్‌తో ఎనిమిదేళ్ల పాటు అనుబంధాన్ని కొన‌సాగించింది.