Read more!

English | Telugu

ర‌ణ‌బీర్‌కు క‌రోనా వ‌చ్చాక అలియా పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా?

 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌పంచం మొత్తానికి ఒక పీడ‌క‌ల‌గా మారింది. ఈ వైర‌స్ కార‌ణంగా జ‌న జీవ‌న‌మే స్తంభించిపోతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. చాలా కాలం పాటు మ‌నుషుల‌ను ఒక‌రికొక‌ర్ని ఇది దూరంగా ఉంచేసింది. సాధార‌ణ పౌరులతో పాటు అనేక‌మంది ప్ర‌ముఖులు కొవిడ్ బారిన ప‌డ్డారు. లేటెస్ట్‌గా ఈ జాబితాలో ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా చేరాడు. మార్చి 9న ర‌ణ‌బీర్ త‌ల్లి నీతూ క‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా త‌న కొడుకు కొవిడ్‌-19 బారిన ప‌డిన‌ట్లు ధ్రువీక‌రించారు. అత‌ను ఇంట్లో స్వీయ క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

కాగా కొద్ది గంట‌ల క్రితం ర‌ణ‌బీర్ ప్రియురాలు అలియా భ‌ట్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఇన్‌స్పైరింగ్ నోట్‌ను షేర్ చేసింది. "We go through what we go through." అంటూ ఒక కొటేష‌న్ పెట్టింది. అంటే.. "మ‌నం దేని ద్వారా వెళ్తామో, దాని ద్వారానే వెళ్తాం." అనేది దాని భావం. త‌ను ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ను పెట్టింద‌ని అలియా ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు.

ఒక రిపోర్ట్ ప్ర‌కారం, అలియా భ‌ట్ క‌రోనా టెస్ట్ చేయించుకోగా, నెగ‌టివ్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆమె స్వీయ క్వారంటెన్‌లో ఉంటోంది. 'గంగుబాయ్ క‌థియ‌వాడి' సినిమా షూటింగ్‌లో ఉన్న ఆమె రెగ్యుల‌ర్ బేసిస్‌లో ఆ టెస్ట్ చేయించుకుంటూ వ‌స్తోంది. సంద‌ర్భ‌వ‌శాత్తూ ఆ సినిమా డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ సైతం కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలారు. ర‌ణ‌బీర్ టెస్ట్ రిజ‌ల్ట్ వ‌చ్చిన కొద్దిసేప‌టికే ఆయ‌న కూడా క‌రోనా బారిన‌ప‌డిన‌ట్లు రిపోర్ట్ వ‌చ్చింది. 'బ్ర‌హ్మాస్త్ర' షూటింగ్‌లో ఉండ‌గా ర‌ణ‌బీర్‌కు క‌రోనా సోకింది. ఆ సినిమాలో అలియా హీరోయిన్‌గా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇలా త‌ను చేస్తున్న ఓ సినిమా హీరో, ఇంకో సినిమా డైరెక్ట‌ర్ కొవిడ్ బారిన ప‌డ‌టంతో, ముందు జాగ్ర‌త్త‌గా అలియా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లింది.