Read more!

English | Telugu

ఎంగేజ్‌మెంట్ చేసుకొని కూడా అక్ష‌య్‌, ర‌వీనా ఎందుకు విడిపోయారు?

 

ఖిలాడీ కుమార్‌గా పేరుపొందిన అక్ష‌య్ కుమార్‌, గ్లామ‌ర్ క్వీన్‌గా యువ‌త హృద‌యాల్లో గిలిగింత‌లు రేపిన ర‌వీనా టాండ‌న్ ఒక‌ప్పుడు పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ్డార‌నీ, ఇద్ద‌రికీ ర‌హ‌స్యంగా ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌నీ, కానీ త‌ర్వాత అక్ష‌య్‌ను ర‌వీనా వ‌దిలేసింద‌నీ మ‌న‌లో చాలామందికి తెలీదు. ర‌వీనా అలా ఎందుకు చేసింద‌నేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం.

అక్ష‌య్‌కు చాలా గాఢంగా ప్రేమించింది ర‌వీనా. వాళ్లిద్ద‌రూ క‌లిసి ప‌నిచేసిన ‘మొహ్రా’ (1994) సినిమా విడుద‌ల స‌మ‌యంలో వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించింది. తెర‌మీద కెమిస్ట్రీ పండించిన ఆ జోడీ ఆఫ్ స్క్రీన్‌లోనూ ద‌గ్గ‌ర‌య్యార‌ని మీడియాలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ ఇద్ద‌రూ పంజాబీలే. అనేక కార్య‌క్ర‌మాల‌కు, వేడుక‌ల్లో ఆ ఇద్ద‌రూ క‌లిసి క‌నిపిస్తూ వ‌చ్చారు. ఆ ఇద్ద‌రి సాన్నిహిత్యం చూసిన వాళ్లంతా ఏదో ఒక‌రోజు త‌మ మ్యారేజ్‌ని వాళ్లు ప్ర‌క‌టిస్తార‌ని భావించారు. పెళ్ల‌య్యాక ఆమె హౌస్ వైఫ్‌గానే ఉండాల‌ని అక్ష‌య్ కోరుకోవ‌డంతో అందుకు అనుగుణంగా సినిమాల‌కు సంత‌కం చేయ‌డం ఆపేసింది ర‌వీనా.
 
1999లో స్టార్‌డ‌స్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న చివ‌రి సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంట‌నే పెళ్లి చేసుకుంటాన‌ని అక్ష‌య్ చెప్పాడ‌ని ర‌వీనా వెల్ల‌డించింది. ఓ గుడిలో తామిద్ద‌రం ర‌హ‌స్యంగా నిశ్చితార్ధం చేసుకున్న‌ట్లు ఆమె చెప్పింది. ఆ టైమ్‌లో నిశ్చితార్ధం విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే, త‌న కెరీర్‌కు ఇబ్బంది ఎదుర‌వుతుంద‌నీ, త‌న ఫిమేల్ ఫ్యాన్స్ గురించి అక్ష‌య్ భ‌య‌ప‌డ్డాడ‌నీ, అందుకే దాన్ని ర‌హ‌స్యంగా ఉంచామ‌నీ ర‌వీనా తెలిపింది. అయితే ఇద్ద‌రికీ ఎక్క‌డ తేడా వ‌చ్చింది?

ఆ టైమ్‌లో అక్ష‌య్‌, ర‌వీనా, రేఖ క‌లిసి న‌టించిన ‘ఖిలాడియోం కా ఖిలాడీ’ (1996) రిలీజ‌య్యింది. అప్పుడు అక్ష‌య్‌, రేఖ బంధం గురించిన సెన్సేష‌నల్ న్యూస్ మీడియాలో వ‌చ్చాయి. అప్ప‌టికే అక్ష‌య్ చ‌ప‌ల మ‌న‌స్త‌త్వం గురించి అనుభ‌వ‌పూర్వ‌కంగా తెలుసుకున్న ర‌వీనా ఈ లింక‌ప్ న్యూస్‌ను భ‌రించ‌లేక‌పోయింది. బ‌ద్ద‌లైన హృద‌యంతో అక్ష‌య్‌కు దూర‌మైంది.
 
బ్రేక‌ప్ త‌ర్వాత అక్ష‌య్‌కు వ్య‌తిరేకంగా ప‌లు సెన్సేష‌న‌ల్ ఇంట‌ర్వ్యూస్ ఇచ్చింది ర‌వీనా. నిబ‌ద్ధ‌త‌ అనేది త‌న‌కు ప్ర‌ధానం అని ఆమె స్ప‌ష్టం చేసింది. అక్ష‌య్ ప్ర‌తిసారీ ఆమె త‌న‌ను క్ష‌మిస్తుంద‌నీ, తిరిగి త‌నను ఆహ్వానిస్తుంద‌నీ ఆశించేవాడు. అప్ప‌టికే మూడేళ్ల‌పాటు అదే ప‌ని చేస్తూ వ‌చ్చిన ర‌వీనా, ఇక ఆ ప‌నిచేయ‌లేన‌ని నిర్ణ‌యించుకుంది. త‌న‌తో ఎంగేమ్‌మెంట్ చేసుకున్న అక్ష‌య్‌, మ‌రో ఇద్ద‌రు అమ్మాయిల‌తోనూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడ‌ని ర‌వీనా తెలిపింది. త‌న బ్రేక‌ప్‌కు ఏ ఇత‌ర స్త్రీనీ బ్లేమ్ చేయ‌న‌నీ, త‌న మ‌నిషికి నిబ‌ద్ధ‌త లేద‌నీ కూడా చెప్పింది ర‌వీనా.