Eto Vellipoyindhi Manasu : భర్తకి మరణగండం ఉందని తెలుసుకున్న భార్య.. జాగ్రత్తగా ఉండమన్న స్వామి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో..... శ్రీలత, శ్రీవల్లిలు ధన, సందీప్ లని బయటకు తీసుకొని రావడానికి స్టేషన్ కి లాయర్ ని తీసుకొని వెళ్తారు. అక్కడ సీఐ సీతాకాంత్ ఫ్రెండ్ తనని చూసి నువ్వు సీతా ఫ్రెండ్ కదా.. వాళ్ళని వదిలేయ్ అని శ్రీలత అనగానే.. పరిచయాలు ఇక్కడ పని చెయ్యవు అని సీఐ అంటాడు. బెయిల్ తీసుకొని వచ్చామని శ్రీలత అనగానే.. బెయిల్ రాదు జనాలని ఫ్రాడ్ చేసిన కేసు ఇది అని అతను చెప్తాడు. అదంతా చూస్తూ భద్రం నవ్వుకుంటాడు. మా వాళ్ళకేం తెలియదు కావాలనే వాళ్ళని ఆ భద్రం కేసులో ఇరికించాడని శ్రీలత అంటుంది.