English | Telugu

నేను రెడీ..పెళ్ళెప్పుడు ప్రియాంక..!

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ శనివారం ఎపిసోడ్ లో శివ్-పరి లవ్ థీమ్ కి కంటెస్టెంట్స్ అంతా ఫిదా ఇపోయారు. శ్రీముఖి వాళ్ళ మధ్య ఏ క్వాలిటీస్ ఎవరు మార్చుకోవాలి లాంటి ప్రశ్నలు అడిగింది.

"శివ్ హడావిడి ఎక్కువ చేస్తాడు అది తగ్గించుకుంటే అంతా బాగుంటుంది" అని చెప్పింది ప్రియాంక జైన్. శివ్ చెప్తూ "అవును హడావిడి చేయడం తగ్గించి స్మూత్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ప్రియాంకలో మార్చుకోవాల్సినవి ఏమీ లేవు. ఆవిడలో అన్ని విషయాలు నచ్చే ఆమెను ప్రేమిస్తున్నాను. మంచి సర్ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామనుకున్నా కానీ అవ్వలేదు. ఫ్యూచర్ లో అలా చేస్తాను. మొదట్లో బాగా మాట్లాడేవాడివి. టీవీ చూస్తూన్న కట్టేసి మాట్లాడేవాడివి.. అందరి అబ్బాయిల్లానే నువ్వు కూడా అంది. దానికి రియల్లీ సారీ. ఐతే ఈసారి పరి నువ్వే నాకు సారీ చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలాసార్లు అడిగావు పెళ్ళెప్పుడు, బయటకు వచ్చాక చేసుకుందామా అని. ఇప్పుడు ఆడియన్స్ ముందు అడుగుతున్నా..మన పెళ్లి ఎప్పుడు..నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను." అన్నాడు శివ్. దానికి ప్రియాంక ఒక మాట చెప్పింది. "నీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుందాం ఒకేనా" అని చెప్పింది. అలా ఇద్దరూ లవ్ థీమ్ కాబట్టి ఐ లవ్ యు అని ఇద్దరూ చెప్పుకున్నారు.

శివ్ చెప్పిన మాటలకు ఖిలాడీ గర్ల్స్ అంతా ఫిదా ఇపోయారు. తేజస్విని మడివాడ ఐతే "అసలు నువ్వంటే ఇష్టం ఉండేది కాదు. ఈ రౌండ్ తర్వాత నాకు నీ మీద గౌరవం పెరిగింది" అంది. ఇక డెబ్జానీ ఐతే ఇలాంటి అబ్బాయి దొరికితే తనకు ఒకే అని చెప్పింది. ఇక శ్రీముఖి ఐతే ఇలాగే ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ విష్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.