English | Telugu

Brahmamudi : హార్ట్ ఎటాక్ తో అత్త హాస్పిటల్ కి.. ఆ నిజం చెప్పేసిన మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -433 లో.... సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి జరుగుతుంది మన అబ్బాయి పెళ్లి.. ఇక్కడేం చేస్తున్నారని ఆడుగుతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్నానని సుభాష్ అనగానే.. అపర్ణ షాక్ అవుతుందిమ అయితే మీకు నాపై చాల కోపం ఉండాలే అని అపర్ణ అనగానే.. కోపం కాదు జాలిగా ఉందని సుభాష్ అంటాడు. అసలు నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని నా టెన్షన్ అని సుభాష్ అనుకుంటాడు. నాపై ఎందుకు అంత జాలి అని అపర్ణ అడుగగా.. అదేం లేదని సుభాష్ అంటాడు. అయితే నా పక్కన వచ్చి నిల్చోండి అని అపర్ణ అనగానే.. నేను రాలేనని సుభాష్ అంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. ఇద్దరు పక్కన ఉండి పెళ్లి జరిపించాలి కదా అని అంటుంది. సుభాష్ కి ఇష్టం లేకున్నా అపర్ణ బలవంతంగా తనని తీసుకొని వెళ్తుంది.

సద్దు...ఒక ముద్దు అని అడిగిన అవినాష్.. నా కొడకా ..అని తిట్టిన రాధ

ఈ వారం నీతోనే డాన్స్ 2 . 0 షోలో అవినాష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. షో స్టేజి మీదకు రాగానే " నా సద్దు బేబీ కోసం వచ్చాను" అంటూ అవినాష్ కాసేపు జడ్జ్ సదాని ఏడిపించాడు. శ్రీముఖి అవినాష్ ని చూసి "ఎవరండీ మీరు" అని అడిగేసరికి "నా గురించి గూగుల్ కొట్టండి వస్తుంది" అని చెప్పాడు. "ఏమని కొట్టాలి" అని అడగడంతో  "నో రిజల్ట్స్ ఫౌండ్" అని వస్తుంది అంటూ తన మీద తానే కౌంటర్ వేసుకున్నాడు. "గూగుల్ కి కూడా తెలియని ఒక సీక్రెట్ సెలెబ్రిటీని నేను నా పేరు పుచుక్, పుచుక్.. నేను ఈ షోకి రావడానికి కారణం సదా బాయ్ ఫ్రెండ్ ని..సారీ నిన్ను సదా అంటున్నాను కానీ సద్దు బేబీ అని పిలుస్తాను " అనేసరికి అందరూ నవ్వారు. "మరి మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది" అని శ్రీముఖి అడిగింది.

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి, ‌సీతాకాంత్ ల పెళ్ళి జరిగింది.. అంతా దైవ నిర్ణయమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -119 లో..... అభితో రామలక్ష్మి లేచిపోయిందని శ్రీలత అంటుంది. దాంతో నా కూతురు అలాంటిది కాదు.. కుటుంబం కోసం ప్రాణం ఇస్తుంది తప్పా.. ఇలా పరువు తక్కువ పని అసలు చెయ్యదని రామలక్ష్మి తల్లి సుజాత ఎమోషనల్ అవుతుంది. మా అక్క గురించి తప్పుగా మాట్లాడకండి అని ధన అంటాడు. అయితే అంత పద్ధతి గల అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్లినట్లు చెప్పండి అని శ్రీలత అంటుంది. రామలక్ష్మి లేచిపోలేదు.. అలా తెలివి తక్కువ పని తను ఎప్పటికి చెయ్యదని సీతాకాంత్ గట్టిగా అరుస్తాడు.

Guppedantha Manasu : ఆ పదవికి నువ్వే కరెక్ట్.. సూటిగా సుత్తిలేకుండా చెప్పేసిన ఫణీంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1097 లో.. రిషి ఉన్నాడు.. వస్తాడు.. ఏదో ఆధారాలు పట్టుకొని లేడని చెప్తే ఎలా? నన్ను నమ్మండి అని మినిస్టర్ తో వసుధార చెప్తుంది. ఇందులో పోలీస్ డిపార్ట్ మెంట్ కాదు. మీరు చెప్పిన కానీ నా నమ్మకం నాది అని వసుధార మీటింగ్ లో నుండి వెళ్లిపోతుంది. ఏంటి సర్ ఒక ఎండీ సీట్ లో కూర్చొని ఉన్న వాళ్ళకి ఎంత సహనం ఉండాలి. కానీ తను మన మాట కూడా వినట్లేదని మినిస్టర్ అంటాడు.. నేను తనతో మాట్లాడుతానని ఫణీంద్ర అంటాడు. మీరు ఏదైనా చేసుకోండి కానీ ఇలా ఉంటే కాలేజీ పాడవుతుంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ కాన్సల్ అయిందని తెలిసి మిషన్ ఎడ్యుకేషన్ ఏం నడిపిస్తారని.. వేరే కాలేజీలు మిషన్ ఎడ్యుకేషన్ మాకు ఇవ్వండంటూ ప్రపోజల్స్ వస్తున్నాయని చెప్పేసి మినిస్టర్ వెళ్ళిపోతాడు.

Brahmamudi : మళ్లీ కోమాలోకి వెళ్ళిన మాయ.. సుభాష్ ఆ పెళ్ళి ఆపగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -432 లో... ఇంకా రెడీ అవ్వలేదని అపర్ణ తన అత్తమామల దగ్గరికి వస్తుంది. దేనికి అని ఇందిరాదేవి కోపంగా సమాధానం చెప్తుంది. ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించాలని అపర్ణ అనగానే.. అంటే కన్యదానం చెయ్యడమా.. కన్యాదానం చెయ్యడానికి అక్కడ కన్య కాదు వరుడు వైపు ఉందామంటే అక్కడ వరుడు కాదు బాబు తండ్రి అని ఇందిరాదేవి కోపంగా అంటుంది. మావయ్య నేను చేసేది తప్పని మీరు కూడా అనుకుంటున్నారా అని అపర్ణ అడుగుతుంది. తప్పొప్పులు నీకు చెప్పేటంతటి వాళ్ళం కాదని సీతారామయ్య అంటాడు.

ఆది..నోరు మూసుకో...హన్సికా ఘాటు వార్నింగ్

ఢీ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో ప్రతీ వారం మంచి డాన్సస్ తో స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోలో ఆది వేసే కుళ్ళు జోకులు ఫుల్ ఫేమస్...ఈ షోకి వచ్చే జడ్జెస్ మీద కూడా జోక్స్ వేస్తూ ఉంటాడు. ఇక ఈ వారం  షోకి జడ్జ్ గా వచ్చిన హన్సిక మీద అలాంటి జోక్స్ వేసాడు. దాంతో ఆమె కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చి పడేసింది. మొన్నటి వరకు ఈ ఢీ షోకి ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు మాత్రం.. ఈ షోలో ప్రణీత స్థానంలో హన్సిక ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే శేఖర్ మాష్టర్ ఉన్నారు..మరో జడ్జ్ గణేష్ మాష్టర్ కూడా కనిపిస్తున్నారు. ఈ వారం ఢీ షోకు గెస్టుగా సుధీర్ బాబు వచ్చాడు. ఆయన్ని ఆయన మూవీస్ ని లింక్ చేస్తూ శేఖర్ మాష్టర్ మీద కౌంటర్లు వేసాడు.  ‘‘మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కసారే చేశారు.