English | Telugu
హీరోయిన్ గా పరిచయమవుతున్న మహేష్ బాబు మేనకోడలు.. పిక్స్ వైరల్
Updated : Oct 29, 2025
- తెరంగ్రేటమ్ చేస్తున్న మహేష్ బాబు మేనకోడలు
- హీరో ఎవరు?
- జాన్వీ పిక్స్ వైరల్
- మంజుల ఆనందం
తెలుగు సినిమా ఎంతకాలం తన మనుగడని కొనసాగిస్తుందో అంతకాలం గుర్తుండి పోయే పేరు సూపర్ స్టార్ ఘట్టమనేని 'కృష్ణ'(Krishna). నటన పరంగానే కాకుండా తెలుగు సినిమా ఎదుగుదలకి ఎన్నో రకాలుగా సేవలు చేసి అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయన ప్రస్థానాన్ని మహేష్ బాబు(Mahesh Babu)కొనసాగిస్తు తండ్రిని మించిన తనయుడిగా దూసుకుపోతున్నాడు. మహేష్ మేనకోడలు, కృష్ణ మనవరాలు జాన్వీ స్వరూప్(Jahnavi Swaroop)సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం సిద్దమయ్యింది.
ఈ మేరకు అధికారకంగా ధ్రువీకరిస్తూ రీసెంట్ గా జాన్వీ ఫోటోలని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. గ్లామర్ కే సరికొత్త అర్ధాన్ని చెప్పే విధంగా ఉన్న జాన్వీ పిక్స్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులతో పాటు మూవీ లవర్స్ జాన్వీ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. తన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తుందనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఏర్పడింది. జాన్వీ తల్లి మంజుల తన కూతురు సినీ రంగ ప్రవేశంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తు తన కూతుర్ని ఆదరించాలని అభిమానులని, ప్రేక్షకులని సోషల్ మీడియా వేదికగా కోరింది.
Also read: మెగా హీరోలని విజయ్ దేవర కొండ ఢీ కొట్టబోతున్నాడా! అభిమానులు ఏమంటున్నారు
నిజానికి ఒకప్పుడు మంజుల(Manjula)హీరోయిన్ గా పరిచయమవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ మేరకు పేపర్ ప్రకటన కూడా వచ్చింది. కానీ అభిమానులు ఆందోళనకి దిగడంతో కృష్ణ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మంజుల, సంజయ్ స్వరూప్ ల కూతురే జాన్వీ. మంజుల, సంజయ్ చాలా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ కి అక్కా, బావగా చేసి హిట్ ఫెయిర్ గా మంచి గుర్తింపు పొందారు. ఇక జాన్వీ 2018 లో మనసుకు నచ్చింది అనే చిత్రంలో బాలనటిగా కనిపించడం విశేషం. మహేష్ మేనల్లుడు, ప్రముఖ హీరో సుదీర్ బాబు కొడుకు దర్శన్ ఫౌజీ లో చిన్నప్పటి ప్రభాస్(Prabhas)గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.