English | Telugu

23 కి ప్రభాస్ కి సంబంధం ఏంటి!  విషయం తెలియడంతో ఫ్యాన్స్ అభినందనలు   

-ప్రభాస్ అభిమానుల శుభాకాంక్షలు
-పాన్ ఇండియా స్టార్ గా అవతరణ
-తెలుగు సినిమాకి కూడా పాన్ ఇండియా గుర్తింపు
-అప్ కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలు

రెబల్ స్టార్ గా అడుగుపెట్టిన ప్రభాస్(Prabhas)ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఒక రకంగా పాన్ ఇండియా స్టార్ గా 'ప్రభాస్' ఎదుగుదల, తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎదగడానికి కూడా దోహద పడిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అభిమాన ఘనం కూడా సినిమా సినిమాకి పెరుగుతు వస్తుంది. అందుకు కారణమైన చిత్రాల లిస్ట్ కూడా అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నాయి.

ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి నేటితో ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది. ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ నవంబర్ 11 2002 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. అంటే నేటికీ 23 సంవత్సరాలు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టర్ హల్ చల్ చేస్తుంది. సదరు పోస్టర్ లో 23 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కి శుభాకాంక్షలు. ప్రతి సినిమా మూమెంట్ ఒక మెమొరీ. నీ కంటు ఒక ఎరా సృష్టించుకున్నావంటు అనే పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

also read: చికిరి సాంగ్ పై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు

అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు 'ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిల్లో దిరాజాసాబ్(The Raja Saab)సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫౌజీ(Fouji)చిత్రీకరణ దశలో ఉండగా స్పిరిట్(Spirit)త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.


ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.