English | Telugu

ఈ వారం సినీ ప్రియులకు పండగే.. సినిమాలు, సిరీస్ లతో సందడే సందడి!

ఈ వారం సినీ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ పలు సినిమాలు సందడి చేయనున్నాయి.

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ 'శివ' నవంబర్ 14న రీ రిలీజ్ అవుతోంది. 4K లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. తమిళ డబ్బింగ్ చిత్రం 'కాంత'తో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అలాగే, నవంబర్ 14న 'సంతాన ప్రాప్తిరస్తు', 'Cమంతం', 'జిగ్రీస్', 'గత వైభవ' వంటి పలు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించనున్నాయి.

నెట్ ఫ్లిక్స్:
మెరైన్స్‌ వెబ్‌సిరీస్‌ - నవంబరు 10
ఢిల్లీ క్రైమ్ 3 (హిందీ సిరీస్) - నవంబరు 13
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (జపనీస్ సిరీస్) - నవంబరు 13
డ్యూడ్‌ మూవీ (తెలుగు/తమిళ) - నవంబరు 14
తెలుసు కదా తెలుగు మూవీ - నవంబరు 14

అమెజాన్ ప్రైమ్ వీడియో:
ప్లే డేట్‌ ఇంగ్లీష్ మూవీ - నవంబరు 12
నిషాంచి హిందీ మూవీ - నవంబరు 14

ఈటీవీ విన్:
ఏనుగు తొండం ఘటికాచలం తెలుగు మూవీ - నవంబరు 13

జియో హాట్‌ స్టార్‌:
జాలీ ఎల్‌ఎల్‌బీ హిందీ మూవీ - నవంబరు 14
అవిహితం మలయాళ చిత్రం - నవంబరు 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇంగ్లీష్ మూవీ - నవంబరు 14

జీ5:
ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా (మలయాళ సిరీస్‌) - నవంబరు 14
దశావతార్ (మరాఠీ చిత్రం) - నవంబరు 14

ఆహా:
కె-ర్యాంప్ తెలుగు మూవీ - నవంబరు 15