English | Telugu

వారణాసి.. నెవర్ బిఫోర్ లుక్ లో మహేష్ బాబు!

మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకి 'వారణాసి' టైటిల్ ను ఖరారు చేశారు. (Varanasi)

మహేష్-రాజమౌళి కాంబోలో కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కి కొద్దిరోజులుగా 'వారణాసి' టైటిల్ ప్రచారం జరుగుతోంది. తాజాగా అదే టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.

టైటిల్ రివీల్ తో పాటు, ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడం కోసం శనివారం సాయంత్రం గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో 'వారణాసి' అనే టైటిల్ ని రివీల్ చేశారు. అంతేకాదు, గ్లింప్స్ లో నంది మీద త్రిశూలం పట్టుకొని మహేష్ కనిపించిన తీరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా మహేష్ బాబుని రాజమౌళి చూపించబోతున్నారని గ్లింప్స్ తో క్లారిటీ వచ్చింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.