English | Telugu
అసలు ssmb 29 ప్రొడ్యూసర్ ఎవరు!
Updated : Nov 15, 2025
-ssmb 29 హంగామా స్టార్ట్
-ఈవెంట్ పై అందరిలో భారీ అంచనాలు
-టైటిల్ చెప్పబోతున్నారా!
-ప్రొడ్యూసర్ కె ఎల్ నారాయణ ఎవరు!
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)అభిమానుల కోలాహలం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీ లో జరిగే ssmb 29 వేడుక అందుకు వేదిక కానుంది. ఈ వేడుకలోనే టైటిల్ ని అనౌన్స్ చెయ్యడంతో పాటు సినిమాకి సంబంధించిన వివరాలని వెల్లడి చేస్తారేమో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. ఈ చిత్రాన్నిదుర్గ ఆర్ట్స్ పతాకంపై 'కెఎల్ నారాయణ'(Kl Narayana)భారతీయ చిత్ర పరిశమ్రలోనే ఇంతవరకు తెరకెక్కని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ssmb 29 ఫీవర్ కూడా స్టార్ట్ కావడంతో కె ఎల్ నారాయణ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతు ఉంది.
కే ఎల్ నారాయణ సినీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి ఉంటు వస్తున్నారు. ఉత్తమ అభిరుచిగల నిర్మాత అనే పేరు కూడా ఉంది. ఒక రకంగా దుర్గ ఆర్ట్స్ అంటే హిట్ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు.1990 లో వెంకటేష్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం తొలి చిత్రం. ఆ తర్వాత హలోబ్రదర్, ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట,సంతోషం, నిన్నే ఇష్టపడ్డాను వంటి విభిన్న జోనర్స్ కి సంబంధించిన చిత్రాలని ప్రేక్షకులకి అందించారు. పైగా ఆ చిత్రాలన్నీ సదరు హీరోలని ని కెరీర్ పరంగా ఇంకో మెట్టు పైకి ఎక్కించాయి. 2003 తర్వాత ఇప్పుడు ssmb 29 తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రాజమౌళి కోసం ఎంతో మంది సినిమా నిర్మించడానికి వెయిట్ చేస్తుండగా,కె ఎల్ నారాయణ ఆ అవకాశం దక్కించుకున్నారు.
also Read:లెజండ్రీ హీరోయిన్ మృతి.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు
ఈ విషయంపైనే ఒక ఇంటర్వ్యూలో కే ఎల్ నారాయణ మాట్లాడుతు మహేష్, రాజమౌళి కాంబోని పదిహేను సంవత్సరాల క్రితమే ఫిక్స్ చేసాం. ఇప్పుడు మహేష్, రాజమౌళి క్రేజ్ మరోస్థాయిలో ఉంది. అయినా నాకిచ్చిన మాటకి కట్టుబడి సినిమా చేస్తున్నారు. అసలు నేను చెప్పకుండానే నాకు సినిమా చేస్తున్నామని ఆ ఇద్దరే అధికారకంగా ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఇక ssmb 29 తో కె ఎల్ నారాయణ కూడా స్టార్ గా అవతరించారని చెప్పుకోవచ్చు.