తారక్, చైతూ తరువాత విజయ్ తో..!?
ఈ తరం కథానాయికల్లో సమంత స్థాయే వేరు. సామ్ అందుకున్న విజయాలు, అవకాశాలు.. మరే హీరోయిన్ అందుకోలేకపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే - `సమంత అంటే సక్సెస్.. సమంత ఉంటే సక్సెస్..` అన్నట్లుగా ఇప్పటికీ తన హవా సాగిస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అందుకే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, యువ సామ్రాట్ నాగచైతన్య వంటి స్టార్స్ తమ కెరీర్ లో సామ్ తోనే ఎక్కువగా జట్టుకట్టారు. `బృందావనం`, `రామయ్యా వస్తావయ్యా`, `రభస`, `జనతా గ్యారేజ్` కోసం సమంతతో తారక్ పదే పదే ఆడిపాడగా.. `ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య`, `మజిలీ` చిత్రాల్లో సామ్ తో మళ్ళీ మళ్ళీ జట్టుకట్టాడు చైతూ...