English | Telugu

తార‌క్, చైతూ త‌రువాత విజ‌య్ తో..!?

ఈ త‌రం క‌థానాయిక‌ల్లో స‌మంత స్థాయే వేరు. సామ్ అందుకున్న విజ‌యాలు, అవ‌కాశాలు.. మ‌రే హీరోయిన్ అందుకోలేక‌పోయింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే - `సమంత అంటే స‌క్సెస్.. స‌మంత ఉంటే స‌క్సెస్..` అన్న‌ట్లుగా ఇప్ప‌టికీ త‌న హ‌వా సాగిస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అందుకే.. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య వంటి స్టార్స్ త‌మ కెరీర్ లో సామ్ తోనే ఎక్కువ‌గా జ‌ట్టుక‌ట్టారు. `బృందావ‌నం`, `రామ‌య్యా వ‌స్తావ‌య్యా`, `ర‌భ‌స‌`, `జ‌న‌తా గ్యారేజ్` కోసం స‌మంత‌తో తార‌క్ ప‌దే ప‌దే ఆడిపాడ‌గా.. `ఏమాయ చేసావె`, `మ‌నం`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌`, `మ‌జిలీ` చిత్రాల్లో సామ్ తో మ‌ళ్ళీ మ‌ళ్ళీ జ‌ట్టుక‌ట్టాడు చైతూ.

క‌ట్ చేస్తే.. తార‌క్, చైతూ త‌రువాత మ‌రో స్టార్ తో నాలుగోసారి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది స‌మంత‌. ఆ క‌థానాయ‌కుడు మ‌రెవ‌రో కాదు.. కోలీవుడ్ టాప్ హీరో విజ‌య్. ఇప్ప‌టికే `క‌త్తి`, `తెరి`, `మెర్స‌ల్`లో క‌లిసి న‌టించిన విజ‌య్, సామ్.. త్వ‌ర‌లో నాలుగోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి రెడీ అవుతున్నార‌ట‌. `మాస్ట‌ర్` త‌రువాత లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ చేయ‌బోయే సినిమా కోస‌మే సమంత‌ని హీరోయిన్ గా లాక్ చేశార‌ని కోలీవుడ్ టాక్. మ‌రి.. విజ‌య్ తో నాలుగోసారి కూడా స‌మంత హిట్ కొడుతుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే విజ‌య్ - లోకేశ్ కాంబో మూవీలో సామ్ ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.