English | Telugu
రాశీ ఖన్నాతో శర్వానంద్ రొమాన్స్!?
Updated : Jun 6, 2022
ప్రస్తుతం కథానాయిక రాశీ ఖన్నా చేతిలో రెండు తెలుగు చిత్రాలున్నాయి. అందులో ఒకటి `పక్కా కమర్షియల్` కాగా.. మరొకటి `థాంక్ యూ`. మ్యాచ్ స్టార్ గోపీచంద్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి రూపొందించిన `పక్కా కమర్షియల్` జూలై 1న విడుదలకు సిద్ధమవుతుండగా.. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన `థాంక్ యూ` జూలై 8న జనం ముందుకు రానుంది. అంటే.. వారం వ్యవధిలో తెలుగునాట రాశీ ఖన్నా డబుల్ ధమాకా ఇవ్వబోతున్నట్టే.
ఇదిలా ఉంటే, తాజాగా రాశీ ఖన్నా మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. యువ కథానాయకుడు శర్వానంద్ తో టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఓ సినిమా తీయబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలో శర్వానంద్ కి జంటగా రాశీ ఖన్నాని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబందించి క్లారిటీ రానున్నది. మరి.. శర్వా, రాశి జోడీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.