English | Telugu

అక్కినేని హీరోతో `డీజే టిల్లు` కెప్టెన్!?

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టైటిల్ రోల్ లో న‌టించిన `డీజే టిల్లు` కోసం మొద‌టిసారిగా మెగాఫోన్ ప‌ట్టాడు విమ‌ల్ కృష్ణ‌. తొలి ప్ర‌య‌త్నంలోనే మ‌ర‌పురాని విజ‌యాన్ని సొంతం చేసుకుని వార్త‌ల్లో నిలిచాడీ యంగ్ డైరెక్ట‌ర్. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని టేక‌ప్ చేయ‌బోతున్నాడ‌ట విమ‌ల్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. తాజాగా అక్కినేని యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌ని సంప్ర‌దించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ చెప్పాడ‌ట విమ‌ల్ కృష్ణ‌. అది న‌చ్చ‌డంతో చైతూ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని బ‌జ్. అంతేకాదు.. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. నాగచైత‌న్య‌తో విమ‌ల్ కృష్ణ ఏ త‌ర‌హా సినిమాని రూపొందిస్తాడో చూడాలి.

ఇదిలా ఉంటే, నాగ‌చైత‌న్య తాజా చిత్రం `థాంక్ యూ` జూలై 8న రిలీజ్ కాబోతోంది. అలాగే, త‌న తొలి వెబ్ - సిరీస్ `దూత‌` ఇదే సంవ‌త్స‌రం ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది. మ‌రోవైపు వెంక‌ట్ ప్ర‌భు, ప‌ర‌శురామ్ లాంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల‌తో త‌న నెక్స్ట్ వెంచ‌ర్స్ క‌మిట్ అయ్యాడు నాగ‌చైత‌న్య‌. అదేవిధంగా.. విమ‌ల్ కృష్ణ త‌ర‌హాలోనే మ‌రో ఇద్ద‌రు ముగ్గురు డైరెక్ట‌ర్స్ కూడా చైతూతో తొలిసారిగా జ‌ట్టుక‌ట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.