English | Telugu
విజయ్‌తో శివ విలేజ్ డ్రామా!?
Updated : Jun 3, 2022
తెలుగు చిత్రం `శౌర్యం` (2008)తో దర్శకుడైన శివ.. ఆనక `సిరుత్తై`(2011)తో తమిళ చిత్ర సీమ బాటపట్టాడు. ఆపై `వీరమ్` (2014), `వేదాళమ్` (2015), `వివేగమ్` (2017), `విశ్వాసమ్` (2019), `అణ్ణాత్తే` (2021) సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ కెప్టెన్ అనిపించుకున్నాడు. కాగా ఇప్పటికే అజిత్, రజనీకాంత్ లాంటి స్టార్స్ తో జట్టుకట్టిన శివ.. త్వరలో మరో టాప్ స్టార్ సూర్యతో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈలోపే మరో అగ్ర కథానాయకుడి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ ని ఇటీవల శివ ఓ ఆసక్తికరమైన కథతో సంప్రదించాడట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సదరు సబ్జెక్ట్ ఎంతగానో నచ్చడంతో విజయ్ కూడా సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పాడని బజ్. అంతేకాదు.. ఓ ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తుందని టాక్. త్వరలోనే విజయ్ - శివ కాంబో మూవీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లితో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. అదయ్యాక `మాస్టర్` కెప్టెన్ లోకేశ్ కనకరాజ్ కాంబోలో మరో మూవీని పట్టాలెక్కించనున్నాడు. అటుపై శివ డైరెక్టోరియల్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముండొచ్చంటున్నారు.