English | Telugu
నడివయస్కుడిగా బన్నీ.. తగ్గేదేలే!?
Updated : Jun 6, 2022
``తగ్గేదేలే`` అంటూ `పుష్ప - ద రైజ్` (2021)తో పాన్ - ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కట్ చేస్తే.. త్వరలో ఈ సినిమా సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్`ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు బన్నీ. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్న ఈ రెండో భాగం.. ప్రస్తుతం ప్రి- ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `పుష్ప - ద రూల్`లో అల్లు అర్జున్ పాత్ర మరింత శక్తిమంతంగా ఉండడమే కాకుండా.. డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయట. ఇందులో భాగంగానే.. ఓ యువకుడికి తండ్రిగా, నడివయస్కుడి పాత్రలో కొంతసేపు దర్శనమివ్వనున్నాడట బన్నీ. అలాగే, ఆయా ఎపిసోడ్స్ లో అల్లు అర్జున్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `పుష్ప - ద రైజ్`ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా.. ఇందులో బన్నీకి జోడీగా రష్మికా మందన్న కొనసాగనుంది. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించనున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. 2023 వేసవిలో ఈ సినిమా రిలీజ్ కావచ్చని టాక్.