English | Telugu

గుప్పెడంత మనసులోకి బ్రహ్మముడి కవి గారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ఈ సీరియల్స్ కి ఉండే క్రేజ్ మాములుగా లేదు. అందులోను గుప్పెడంత మనసు సీరియల్ కి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. కొత్తగా వస్తున్న సీరియల్ కోసం గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ మార్చొద్దని ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రెండింగ్ క్రియేట్ చేసి.. స్టార్ మా యాజమాన్యానికి మెసెజ్, కాల్స్ చేస్తున్నారు. బ్రహ్మముడికి, గుప్పెడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిమ ఎందుకంటే రెండింటలోను కథ బాగుంటుంది. అందులో రిషి,-వసుధార, ఇందులో రాజ్-కావ్య .. ఆన్ స్క్రీన్ పై ఈ రెండు జంటల మధ్య బాండింగ్, లవ్ వల్లే ఈ రెండింటికి అంత క్రేజ్ లభిస్తోంది.

ముగిసిన అమెరికా టూర్.. ధన్యవాదాలు చెప్పిన సునీత

టాలీవుడ్‌ టాప్ సింగర్స్ లో సునీత ఫుల్ ఫేమస్. తన అద్భుతమైన గాత్రంతో వందల పాటలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. గాత్రమే కాక హీరోయిన్స్ కి పోటీగా  తన అందంతో కూడా అలరిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.  తన ఫోటోలు, పాటలు, తన కుమారుడి వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న సునీత ఫేమస్ బిజినెస్ పర్సన్ రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే నెల రోజుల నుంచి అమెరికాలో సునీత మ్యూజిక్ కన్సర్ట్స్ లో పాల్గొని తిరిగి వస్తున్న సందర్భాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది.

బ్రహ్మముడి ‌కలిపింది ఆ ఇద్దరిని.. ఇందిరాదేవి పూజ ఫలించినట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -87 లో.. రాజ్, కావ్యలు ఒకే గదిలో నిద్రపోతుండగా..  రాజ్ బెడ్ మీద నుండి దొర్లుతూ కావ్యపై పడతాడు. అలా రాజ్ పడడంతో కావ్య భయపడుతూ.. నన్నేం చెయ్యొద్దంటూ గట్టిగా అరుస్తుంది. మీరు డీసెంట్ అనుకున్నాను.. మీరు ఒక విలన్ అని అంటూ అరుస్తూ డోర్ దగ్గరికి వెళ్తుంది. నేను విలన్ అయితే నువ్వు హీరోయిన్ వా అని రాజ్ అంటాడు. కావ్య అరుపులు విని ఇందిరాదేవి, కళ్యాణ్, రాజ్ బాబాయ్ వస్తారు. ఏమైందని అడుగుతుంది రుద్రాణి. అమ్మమ్మ గారు అంటూ ఇందిరాదేవి మీద పడి ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తుంది కావ్య. ఏం చెప్పను అమ్మమ్మ.. బోరున ఏడువాలని ఉందని కావ్య అంటుంది. ఏం అన్నావ్ రా.. మొరటోడా.. నా మనవరాలిని అలా బయపెడతవా.. అయినా నువ్వు నచ్చ చెప్పుకోవాలి కానీ అలా బయపెడతారా అని ఇందిరాదేవి కావ్యను అంటుంది.

మెడికల్ కాలేజ్ ప్లాన్ ని కనిపెట్టిన ‌శైలేంద్ర.. రిషి పసిగట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -754 లో.. రిషి మెడికల్ కాలేజీ గురించి అందరితో మాట్లాడుతాడు. డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే కాప్షన్ తో.. మన కాలేజీ ద్వారా ఫ్రీగా నాణ్యమైన విద్యని అందించాలని, చదవాలని కోరిక ఉండి చదవలేకపోయేవారికి మన కాలేజీలో విద్యనందించాలి.. దీనికి సంబంధించి కొంతమంది డాక్టర్స్ తో నేను మాట్లాడాను. ఒక్కొక్కరు ఒక్కో స్టూడెంట్స్ కి అయ్యే ఖర్చుని భరిస్తానన్నారు అని రిషి చెప్పగానే.. మంచి ఆలోచన అంటూ ఫణింద్ర, మహేంద్రలు రిషిని పొగుడుతారు.. ఇదంతా చూస్తున్న శైలేంద్ర కుళ్ళుకుంటాడు.

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ హీరోయిన్ జాస్మిన్ రాత్ ఎవరంటే

ఒడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో జాస్మిన్ రాత్ తన నటనతో రాణిస్తోంది. జాస్మిన్ 2019 లో జీ సార్థక్ లో 'సర్గం' అనే సీరియల్ తో అరంగేట్రం చేసింది. తర్వాత "మాయ, మా జహారా సహ" ఇప్పుడు "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" వంటి సీరియల్స్‌లో నటించింది. జాస్మిన్ జనవరి 10, 2002న ఒడిశాలోని భువనేశ్వర్‌లో పుట్టింది. జాస్మిన్ భువనేశ్వర్‌లోని ప్రభుజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో స్కూలింగ్ కంప్లీట్ చేసింది. బాంబే యూనివర్సిటీలో  గ్రాడ్యుయేషన్ చేసింది. 2018లో, జాస్మిన్ రాత్ మోడలింగ్‌లో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. తర్వాత "ఇ సమయ, రూపసి జన్హా, జానీ తు అజానా, హేలా కి ప్రేమ, తు మోరీ దునియా" మొదలైన మ్యూజిక్ ఆల్బమ్స్ లో చేసింది. ఆమె ట్రైన్డ్ ఒడిస్సీ డ్యాన్సర్ కూడా.  ఇంటిగ్రేటెడ్ బిఏఎల్ఎల్ బి కూడా చేసింది. 2020లో జాస్మిన్ తరంగ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన "మాయ" అనే  సీరియల్‌లో రుద్రి అనే లీడ్ రోల్ లో నటించింది.

 "కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని" సీరియల్ హీరో ఎవరో తెలుసా ?

శాండల్ వుడ్ స్టైలిష్ టీవీ యాక్టర్ విజయ్ సూర్య స్టార్ మాలో త్వరలో ప్రసారం కాబోతున్న "కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని" అనే సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు. విజయ్ సూర్య కన్నడలో అటు మూవీ ఇండస్ట్రీలోనే, ఇటు బుల్లితెర చరిత్రలో కూడా తన నటనతో రాణిస్తున్నాడు. 2012 లో వచ్చిన రవిచంద్రన్ మూవీ "క్రేజీ లోక" లో కనిపించాడు. అలాగే ఈటీవీ కన్నడలో ప్రసారమైన  సీరియల్ "అగ్నిసాక్షి"లో సిద్ధార్థగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే అతను  బెంగళూరులో పుట్టి పెరిగాడు. అతని తండ్రి నాగరాజ్, తల్లి  లలితాంబ. అతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. పేరు రవి సూర్య . దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు. సూర్య తన స్కూలింగ్ ని క్లారెన్స్ పబ్లిక్ స్కూల్‌లో, కాలేజీ  ఎడ్యుకేషన్ ని బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో  పూర్తి  చేసాడు. సుభాష్ ఘయ్ కి చెందిన విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్‌లో చేసి యాక్టింగ్  కోర్స్ లో డిగ్రీ సంపాదించాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తన కెరీర్ ని స్టార్ట్ చేసాడు విజయ్.

శ్రీసత్య గురించి క్లారిటీ ఇచ్చి‌న అర్జున్ కళ్యాణ్..!

అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమయ్యాడు. శ్రీసత్య అంటే గురించి మాట్లాడితే అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ లో శ్రీసత్య వెంటే ఉంటూ.. తనతోనే ఎక్కువ టైం గడిపేవాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు ఒక వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసాడు.. అది కూడా ఎక్కువ పాపులారిటీ రాకపోయేసరికి ఎవరికి ఎక్కువగా తెలియలేదు.  ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీసత్య కోసం తన గేమ్ ని కొన్ని సందర్బాలలో త్యాగం చేసాడు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కి రావడం కూడా.. శ్రీ సత్య వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అర్జున్ కళ్యాణ్.

ఆదిరెడ్డికి టీవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆసక్తి లేదంట!

ఆదిరెడ్డి బిగ్ బాస్ తో ఫేమ్ లొకి వచ్చిన యూట్యూబర్.. అదిరెడ్డి బిగ్ బాస్ అంటే ఇష్టంతో.. ఇప్పటిదాకా అన్ని సీజన్లకి రివ్యూ ఇచ్చాడు. అతను ఇచ్చిన రివ్యూస్ కు లక్షల్లో వ్యూస్ వచ్చేవి అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక యూట్యూబర్  గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి  కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోంచి బయటకొచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ టీవీ రంగంలోకి లేదా సినిమాలలోకి వెళ్ళాలని చూస్తారు. అయితే ఆదిరెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఫేమ్ వచ్చిన కూడా తను ఉన్న ఊరి నుండి వేరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు.

లేవగానే దాన్ని చూస్తే కెవ్వు కేక కదా!

బుల్లితెర మీద పటాస్ ఫైమా కామెడీ పీక్స్ అని చెప్పొచ్చు..లేడీ కమెడియన్స్ లో చాలా త్వరగా పేరు సంపాదించిన వాళ్లలో ఫైమా, రౌడీ రోహిణి ఇద్దరూ ఉన్నారు. ఇక ఫైమా బుల్లితెర మీద షోస్ లో నవ్విస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ని కొట్టేసింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడు బుల్లితెరను ఏలేస్తోంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీముఖికి సిస్టర్ గా చేస్తూ నవ్విస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. "బీబీ హౌస్ లోకి ఛాన్స్ వస్తే వెళ్తారా" అని అడిగేసరికి "వస్తే వెళ్తాను...ఆల్రెడీ ఒక సీజన్ చేసాను కాబట్టి పిలవకపోవచ్చు..కానీ ఓటిటి వెర్షన్ కి పిలవచ్చేమో..పిలిస్తే మాత్రం డెఫినెట్ గా వెళ్తాను" అని చెప్పింది. "గీతూ అక్క ఇన్స్టా పేజీకి బ్లూ టిక్ వచ్చేసింది