English | Telugu
హమ్దాన్ వన్ మంత్ బర్త్డే ని సెలెబ్రేట్ చేసుకున్న పూర్ణ
Updated : May 5, 2023
కేరళకు చెందిన పూర్ణ అలియాస్ షమ్నా కాసిం అటు బుల్లితెర మీద ఇటు వెండితెర మీద నటిస్తూ అందరికీ బాగా తెలిసిన నటి. ‘మంజు పోలోరు పెన్‌కుట్టి’ అనే మలయాళ సినిమా ద్వారా 2004లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ మూడేళ్ల పాటు మాలీవుడ్‌లోనే నటించింది. 2007లో శ్రీహరి హీరోగా వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరవాత తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ‘సీమ టపాకాయ్’, ‘అవును’ ‘దృశ్యం 2’, ‘అఖండ’, ‘తీస్ మార్ ఖాన్’, లడ్డు బాబు, ‘దసరా’ వంటి మూవీస్ లో పూర్ణ కనిపించింది. బుల్లితెర మీద "ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ" వంటి షోస్ లో కూడా కనిపించి అలరించింది. అలాంటి పూర్ణ తన పెళ్లి సెట్ అయినప్పట్నుంచి.. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూనే ఉంది.
ఒక నెల క్రితం పూర్ణ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి హమ్దాన్ అసిఫ్ అలీ అనే పేరు పెట్టుకుంది పూర్ణ. హమ్దాన్ రాకతో తమ జీవితాలు సంపూర్ణమయ్యాయని ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టుకుంది. ఇప్పుడు తన బిడ్డ పుట్టి ఒక నెల ఐన సందర్భంగా కేక్ కట్ చేశారు పూర్ణ , షానిద్ ఆసిఫ్ అలీ. ఐతే పూర్ణ తన హమ్దాన్ ఫేస్ ని ఇంకా రివీల్ చేయలేదు. షానిద్ తన బిడ్డను ముద్దాడుతున్న ఫోటోని పూర్ణ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.