English | Telugu
ఆదిరెడ్డికి టీవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆసక్తి లేదంట!
Updated : May 4, 2023
ఆదిరెడ్డి బిగ్ బాస్ తో ఫేమ్ లొకి వచ్చిన యూట్యూబర్.. అదిరెడ్డి బిగ్ బాస్ అంటే ఇష్టంతో.. ఇప్పటిదాకా అన్ని సీజన్లకి రివ్యూ ఇచ్చాడు. అతను ఇచ్చిన రివ్యూస్ కు లక్షల్లో వ్యూస్ వచ్చేవి అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోంచి బయటకొచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ టీవీ రంగంలోకి లేదా సినిమాలలోకి వెళ్ళాలని చూస్తారు. అయితే ఆదిరెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఫేమ్ వచ్చిన కూడా తను ఉన్న ఊరి నుండి వేరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు.
ఆదిరెడ్డి మొదట నుండి కష్టపడేతత్వం గల వ్యక్తి. ఇది బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులకు తెలిసిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ గా కుటుంబం పట్ల తను చూపించే కేరింగ్.. అతని ఆలోచన విధానం అన్ని కూడా బాగుంటాయి. ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మికి కంటిచూపు సరిగా ఉండదు.. అయినా కరోనా టైంలో ఫండ్స్ కింద తన పెన్షన్ డబ్బులు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఇలా తన ఫ్యామిలీ అంత కొద్దో గొప్పో అందరికి తెలిసినవాళ్ళే. ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ అయిపోయి.. తన యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.
ఆదిరెడ్డి బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక రెండు మూడు టీవీ షోస్ లో మెరిసినా.. ఆ తర్వాత మళ్ళీ టీవీలో ఎక్కడ కన్పించలేదు. కానీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు, యూట్యూబ్ ఛానెల్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ, ఫాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో.. 'అస్క్ మీ క్వశ్చన్' అని స్టార్ట్ చేసాడు ఆదిరెడ్డి. అందులో తన ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్ కి సానుకూలంగా సమాధానమిచ్చాడు. బిగ్ బాస్-7 కి కూడా రివ్యూ ఇస్తారా అని ఒక అభిమాని అడగగా.. 'చేస్తాను.. నేను బిగ్ బాస్-6 లో ఎలా ఉన్నానో వాటికి సంబంధించిన వీడియోలను కూడా చూపిస్తానని ఆదిరెడ్డి చెప్పాడు.
మీరు ఎందుకని హైదరాబాద్ లో సెటిల్ కాలేదు.. టీవీ షోస్ వస్తాయి కదా అని ఒకరు అడుగగా.. నాకు వచ్చిన అన్నింటికి వెళ్లట్లేదు, టీవీ ఇండస్ట్రీపై అంతగా ఇంట్రస్ట్ లేదని ఆదిరెడ్డి చెప్పాడు. ఇలా ఫ్యాన్స్ అడిగిన దానికి ఓపికగా సమాధానం చెప్తూ ఆదిరెడ్డికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు. మీ వాట్సాప్ ప్రొఫైల్ ఏంటని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు.. రిప్లై గా తన వాట్సాప్ ప్రొఫైల్ ని పోస్ట్ చేసాడు ఆదిరెడ్డి. ప్రస్తుతం ఐపీఎల్ కి రివ్యూస్ చెప్తూ బిజీగా ఉంటున్న ఆదిరెడ్డి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.