English | Telugu

వాళ్ళ డ్రామా చూసి ఎంజాయ్ చేయండి..!

హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో‌ నటించిన హిమజ..‌ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తోస సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది.

హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.

అయితే ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉంటోంది హిమజ. తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ , పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆక్టివ్ గా ఉండే హిమజ.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక మెసెజ్ ఇచ్చింది.. అదేంటంటే.. "అవసరానికో, భయానికో మనతో ప్రేమగా నటించేవాళ్ళని దూరం పెట్టకండి.. జస్ట్ వాళ్ళ డ్రామాని ఎంజాయ్ చేయండి" అని ఆ పోస్ట్ లో రాసింది హిమజ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన ముక్కు బాలేదు, కళ్ళు బాలేదని డైరెక్టర్లు చెప్పేవారంట.. ఇప్పుడు స్క్రీన్ మీద తను యాక్ట్ చేసాక.. తన కళ్ళే బాగుంటాయని చాలామంది చెప్తున్నారంట.. మరి హిమజ తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలియాల్సి ఉంది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.