English | Telugu
ఆయన బాగా అలుగుతారు.. ఎవరికీ కనబడకుండా బైక్ మీద తిరిగేవాళ్ళం!
Updated : May 4, 2023
'అలా మొదలయ్యింది' టాక్ షో స్టార్ట్ ఐన కొంత కాలానికే మంచి రేటింగ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు దానికి సంబంధించిన నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి డైరెక్టర్ మారుతి అతని వైఫ్ స్పందన వచ్చారు. రావడంతోనే పేరు చెప్పాలి అని కిషోర్ అడిగేసరికి హారతి అవన్నీ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని సెటైర్ వేసాడు మారుతి. "స్వీట్స్ తీసుకొచ్చి ఇలా పెట్టింది..నేను సగమే తీసుకున్నాను" అప్పుడు "మొత్తం తీసుకోవచ్చు అనే వాయిస్ వినిపించింది" అని మారుతీ చెప్పేసరికి " 8TH క్లాస్ లో ముఖం నచ్చింది, 9TH క్లాస్ లో టాలెంట్ నచ్చింది, 10TH క్లాస్ కి వచ్చేసరికి ఆయన వెళ్లిపోయారు" అని చెప్పింది స్పందన. "పడేయడానికి ఒక్కో టాలెంట్ చూపించుకుని రావాలి కదా మరి" అని కౌంటర్ వేసాడు మారుతీ. "తూనీగలు కాదు కానీ, నంబరింగ్లు, స్టికర్ ప్లేట్లు" అని చెప్పాడు. "విజయవాడ ట్రాఫిక్ లో ఎవరో డాష్ ఇస్తే ఆ ముక్కలన్నీ ఏరుకొచ్చి దాచుకున్నాడు" అని చెప్పింది స్పందన.
"తాను ఆర్టీసీ బస్సులో వస్తే నేను స్కూటీ మీద వెళ్లేదాన్ని అలా ఎవరికీ కనపడకుండా నా స్కూటీ మీద దొంగతనంగా తిరిగేవాళ్ళం" అని చెప్పింది స్పందన. "ఏమిటి ఇప్పుడు మళ్ళీ స్కూటీ మీద నిన్ను తిప్పాలి" అని అంటూనే తన బైక్ ని స్టేజి మీదకు తెచ్చి ఇద్దరూ హుషారుగా చక్కర్లు కొట్టారు. ఇంతలో కిషోర్ ఆ బండిని ఆపి "ఎక్కడినుంచి వస్తున్నారు..ఇద్దరికీ పెళ్లయిందా" అనేసరికి "అలా మొదలయ్యింది అనే షోకి వెళ్లొస్తున్నాం. ఇద్దరికీ పెళ్లి చేస్తారా" అని కామెడీ చేసాడు మారుతీ. "ఈవిడ ఎం చేసేది అంటే రోజూ డైరీ రాసేది..ఇంప్రెస్స్ చేయడానికి చాలా ఎదవ పనులు ఉంటాయి కదా" అని చెప్పాడు. "ఎప్పుడైనా అలుగుతారా" అని కిషోర్ అడిగేసరికి "మా అమ్మాయిని అడగండి చెప్తుంది..డాడీ అలిగారు" అంటుంది. "తాళి కట్టిన తర్వాత ఒకసారి నన్ను చూడవే" అన్నారు "నేను చూసేసరికి..హమ్మయ్య ఒక పనైపోయింది" అన్నారు అంటూ కామెడీగా చెప్పింది. ఇలా నెక్స్ట్ వీక్ మారుతీ-స్పందన ఎన్నో విషయాలు చెప్పారు.