English | Telugu

లేవగానే దాన్ని చూస్తే కెవ్వు కేక కదా!

బుల్లితెర మీద పటాస్ ఫైమా కామెడీ పీక్స్ అని చెప్పొచ్చు..లేడీ కమెడియన్స్ లో చాలా త్వరగా పేరు సంపాదించిన వాళ్లలో ఫైమా, రౌడీ రోహిణి ఇద్దరూ ఉన్నారు. ఇక ఫైమా బుల్లితెర మీద షోస్ లో నవ్విస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ని కొట్టేసింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడు బుల్లితెరను ఏలేస్తోంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీముఖికి సిస్టర్ గా చేస్తూ నవ్విస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. "బీబీ హౌస్ లోకి ఛాన్స్ వస్తే వెళ్తారా" అని అడిగేసరికి "వస్తే వెళ్తాను...ఆల్రెడీ ఒక సీజన్ చేసాను కాబట్టి పిలవకపోవచ్చు..కానీ ఓటిటి వెర్షన్ కి పిలవచ్చేమో..పిలిస్తే మాత్రం డెఫినెట్ గా వెళ్తాను" అని చెప్పింది. "గీతూ అక్క ఇన్స్టా పేజీకి బ్లూ టిక్ వచ్చేసింది.

నీ పేజీకి ఎప్పుడు వస్తుంది" అని అడిగేసరికి " నేను ఆ మూమెంట్ కోసమే చూస్తున్నా..ఎప్పుడొస్తుందా అని..ఎంత బాగుంటుందో అలా వస్తే..నేను పడుకుని మార్నింగ్ లేవగానే ఇన్స్టాగ్రామ్ పేజీ చూసినప్పుడు బ్లూ టిక్ కనిపిస్తే కెవ్వు కేక కదా..మరేంచేద్దాం. ఇప్పటిదాకా అది కలగానే మిగిలిపోయింది. 50 కే ఉన్నప్పటి నుంచి అనుకున్నా ఎప్పటికైనా 500 కే చేసుకోవాలి అని ఇప్పుడు 400 కే అయ్యింది. చూద్దాం..ఎదో ఒక రోజు నా రోజు కాకపోతదా" అని చెప్పింది. "మూవీలో ఛాన్స్ వస్తే చేస్తారా" అనేసరికి "తప్పకుండా చేస్తాను. అక్కడ కూడా నేను మిమ్మల్ని నవ్వించడానికి స్కోప్ ఉన్న లెన్తీ పాత్ర రావాలి..వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను" అని చెప్పింది. "సత్యకి నీకు మధ్య ఫ్రెండ్షిప్ గురించి" అని అడిగేసరికి "నాకు చాలా తక్కువ టైంలో కనెక్ట్ అయ్యింది. తాను ఎక్కడికి వెళ్లిన నాతో పాటు ఫైమా ఉంటే బాగుండు అని పిలిచేంత ఫ్రెండ్ షిప్ మా మధ్యన ఉంది. ఆ బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి" అని నేను కోరుకుంటున్నా అని చెప్పింది ఫైమా