English | Telugu
గుప్పెడంత మనసులోకి బ్రహ్మముడి కవి గారు!
Updated : May 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ఈ సీరియల్స్ కి ఉండే క్రేజ్ మాములుగా లేదు. అందులోను గుప్పెడంత మనసు సీరియల్ కి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. కొత్తగా వస్తున్న సీరియల్ కోసం గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ మార్చొద్దని ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రెండింగ్ క్రియేట్ చేసి.. స్టార్ మా యాజమాన్యానికి మెసెజ్, కాల్స్ చేస్తున్నారు. బ్రహ్మముడికి, గుప్పెడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిమ ఎందుకంటే రెండింటలోను కథ బాగుంటుంది. అందులో రిషి,-వసుధార, ఇందులో రాజ్-కావ్య .. ఆన్ స్క్రీన్ పై ఈ రెండు జంటల మధ్య బాండింగ్, లవ్ వల్లే ఈ రెండింటికి అంత క్రేజ్ లభిస్తోంది.
అయితే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీలో లో నెంబర్ వన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో రాజ్ కి తమ్ముడిగా చేస్తోన్న కళ్యాణ్ అలియాస్ కిరణ్ ప్రేరణి కవిగా అందరికి సుపరిచితమే.. ప్రతీ సీన్ లోను కళ్యాణ్ తన కవిత్వంతో తెలుగుని బ్రతికిస్తూ.. చుట్టూ ఉండేవారికి విసుగు తెప్పిస్తున్నట్టుగా మాట్లాడుతుంటాడు. దీంతో ఈ సీరియల్ లోని కావ్య కూడా కళ్యాణ్ ని 'కవి గారు' అని పిలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మముడి కవిగారు కొత్తబాట పట్టినట్టున్నారు.
బ్రహ్మముడిలో చేస్తున్న కవి కళ్యాణ్ అలియాస్ కిరణ్ ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ లోకి వచ్చేసాడు. అంటే గుప్పెడంత మనసు సీరియల్, బ్రహ్మముడి సీరియల్ పక్క పక్కనే జరుగుతుండటంతో కళ్యాణ్, రిషితో కలిసి ఒక వీడియో బైట్ చేశాడు. దీన్ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాడు కళ్యాణ్. అయితే ఇందులో బ్రహ్మముడి టీం రాహుల్, రుద్రాణి, రాజ్, కావ్య అందరూ కలిసి సరదాగా గడిపిన వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేసాడు కళ్యాణ్. అయితే ఈ వీడియో టైటిల్ ని 'గుప్పెడంత మనసులోకి కవిగారు' అని పెట్టడంతో.. గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులంతా చూస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు.. మీరు కూడా గుప్పెడంత మనసు సీరియల్ లోకి రావొచ్చు కదా కళ్యాణ్ గారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియోకి ఇప్పుడు విశేష స్పందన లభిస్తుంది.