English | Telugu
ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్ళిన బలగం నటి!
Updated : May 5, 2023
రోహిణి.. ప్రస్తుతం బుల్లితెరపై లేడీ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తనధైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ లో తన నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది రోహిణి. ఆ సీరియల్ లో తన పాత్రలో బాగా నవ్వించింది. ఆ తర్వాత 'శ్రీనివాస కళ్యాణం', 'ఇన్స్పెక్టర్ కిరణ్' అనే సీరియల్స్ లో నటించి మెప్పించింది.
'బలగం' సినిమాలో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మధ్యే ఓటిటిలో విడుదలయిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగెర్స్' లో రోహిణి నటించింది. అందులో తను చేసిన కామెడీతో వెబ్ సిరిస్ కి ప్రాణం పోసిందనే చెప్పాలి. అయితే రోహిణి మొదటగా తన కెరీర్ ని సీరియల్స్ తో స్టార్ట్ చేసింది. ఒక ఛానల్ వాళ్ళ ప్రోగ్రామ్ లో పాల్గొన్న రోహిణి.. తన చలాకీతనంతో ఆకట్టుకుందంట.. దాంతో ఆ షో లో తనకి ఒక ఛాన్స్ వచ్చిందట. ఆ తర్వాత బిగ్ బాస్ -3 లో అవకాశం లభించింది. అందులో తను ఎక్కువగా యాక్టివ్ గా లేకపోయేసరికి అభిమానులను సంపాదించుకోలేకపోయింది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన నాలుగు వారాలకే బయటకు వచ్చింది.
అయితే బిగ్ బాస్ తర్వాత బుల్లితెర సీరియల్స్, షోస్ లో రోహిణికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కొన్ని సీరియల్స్ లో డబ్బింగ్ కూడా చెప్పింది.. ఆ తర్వాత నుండి రోహిణికి ఫ్యాన్ బేస్ పెరిగింది. అంతేకాకుండా బుల్లితెరలో కామెడీ షోస్ లో పాల్గొంటూ తనలోని మరొక హాస్యాన్ని బయటకు తీసింది. అలా మంచి కామెడీ టైమింగ్ తో అలరిస్తూ.. జబర్దస్త్ లో ఛాన్స్ కొట్టేసింది రోహిణి. ఇప్పటివరకు రోహిణి కెరీర్ లో బలగం, సేవ్ ది టైగర్స్ రెండు మంచి హిట్స్ గా నిలిచాయి. దీంతో రోహిణి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే పనిలో పడింది. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్న రోహిణి ఇప్పుడు ఫేమస్ అయింది. అయితే తను చేసే ప్రతీ వీడీయోని తనకున్న యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా తను ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కి వెళ్ళింది. ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా.. ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.