English | Telugu

ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ కు మాతృ వియోగం 

ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. శంకర్ తల్లి నిమ్మల సక్కుబాయమ్మ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు(జనవరి 28) తుది శ్వాస విడిచారు. అంతిమ సంస్కారాలు రేపు మధ్యాహ్నం జరగనున్నాయి. (Director N Shankar)

సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న అరుదైన దర్శకులలో శంకర్ ఒకరు. 1997లో 'ఎన్‌కౌంటర్' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం, జై బోలో తెలంగాణా వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అద్యక్షుడిగానూ పని చేశారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం