English | Telugu

మెగా ఛాన్స్ కొట్టేసిన 'క' దర్శక ద్వయం.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ!

మెగా కాంపౌండ్ లోకి 'క' దర్శకులు
మెగా హీరోతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' సినిమాతో దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకులుగా పరిచయమయ్యారు. రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది. కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. దర్శకులుగా సుజీత్, సందీప్ లకు ఎంతో పేరు తీసుకొచ్చింది. దీంతో వారి రెండో సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే వారికి మెగా కాంపౌండ్ లో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (Sujith and Sandeep)

'క' దర్శక ద్వయంతో సినిమా చేయడానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రూ.90 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 'విరూపాక్ష'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సాయి తేజ్.. ఇప్పుడు తన మార్కెట్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' (Sambarla Yeti Gattu) అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. రోహిత్ దర్శకత్వంలో దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయనున్నారు.

'సంబరాల ఏటిగట్టు' తర్వాత కూడా మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సాయి తేజ్. ఈ చిత్రానికి 'క' దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వం వహించనున్నారు. కొద్ది నెలలుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. గతంలో సుజీత్, సందీప్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి డెవలప్ చేయమని చెప్పాడు సాయి తేజ్. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ ని విని.. సినిమా చేయడానికి సాయి తేజ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం