English | Telugu

Siri Hanumanth: నీ యాంకరింగ్ జస్ట్ వన్ మంత్ అంటూ సిరిపై సెటైర్స్!


జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చిందో లేదో నూకరాజు అప్పుడే ఆమె మీద సెటైర్స్ వేసేశాడు. నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇంద్రజ స్టేజి మీదకు వచ్చి దేవకన్యలా వైట్ డ్రెస్ లో వచ్చిన కొత్త యాంకర్ సిరిని ఇన్వైట్ చేసి విషెస్ చెప్పింది. ఇంద్రజ రాక ముందు వచ్చి సీట్ లో కూర్చున్న కృష్ణ భగవాన్ ని చూసి "అన్నయ్య అదేంటి ఎప్పుడూ నా ఎంట్రీ వచ్చాకే కదా మీ ఎంట్రీ..మరి నాకంటే ముందు కుర్చున్నారేంటి" అని అడిగేసరికి "కొత్త యాంకర్ వచ్చింది అని చెప్పారు..ఎప్పుడు చూద్దామా అని చెప్పి నీకన్నా ముందొచ్చాను" అంటూ సిరికి వెల్కమ్ చెప్పారు.

ఇక ఈ ప్రోమో ఫైనల్ లో ఉంది అసలు ట్విస్ట్. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి సోషల్ మీడియాలో తెలియని వారంటూ ఎవరూ లేరు. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ కోట్లు సంపాదిస్తూ కొత్త ప్రాంతాలు చూపిస్తూ పచ్చి తెలుగు పదాలతో అసలు నిజాలు చెప్తూ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ ఉంటాడు. అన్వేష్ టాకింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ ని ఇమిటేట్ చేస్తూ నూకరాజు రాబోయే ఎపిసోడ్ లో ఒక స్కిట్ వేసాడు. ఇక రియల్ అన్వేష్ తనకు నచ్చిన బ్రెజిల్ అమ్మాయి మెలిసాతో లవ్ లో పడి ఆమెతో ఉన్న వీడియోస్ కూడా ఎక్కువగా పోస్ట్ చేయడం అందరికీ తెలుసు. అలా నూకరాజు తన పక్కన ఒక లేడీ గెటప్ ని పెట్టుకున్నాడు. ఇక ఆమె యాంకర్ సిరిని చూసి "ఆమె కూడా చైనీస్" అని అనేసరికి "హలో నేను చైనీస్ కాదు కొత్త యాంకర్ సిరి హన్మంత్" అంటూ తన ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. "ఇదిగో హనుమంతు..నీ యాంకరింగ్ జస్ట్ వన్ మంతు...తర్వాత వేరే వాళ్ళ వంతు..ఈ సెట్టు మీద ఏ ఆర్టిస్ట్ యాక్టింగ్ చేసిన వాళ్ళ జీవితం సెట్టు...కాదని ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ షెడ్యూల్ కట్టు..ఎందుకంటే నన్ను చూస్తున్నారు కదా" అంటూ నూకరాజు చేసిన కామెడీకి అందరూ పడి పడి నవ్వారు. ఇక నూకరాజు గెటప్ అన్వేష్ గెటప్ తో ఈక్వల్ గా మ్యాచ్ అయ్యేసరికి నెటిజన్స్ నూకరాజు కామెడీకి ఫిదా ఇపోయారు.