English | Telugu

Bigg Boss 7 Telugu : హౌస్ లో బంగారం, మట్టి, బొగ్గు ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిదవ వారం ఆసక్తికరంగా సాగింది. ప్రతీ శనివారం బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తారు. దీనికి ఒక కారణం నాగార్జున హోస్టింగ్ ఒకటి అయితే, కంటెస్టెంట్స్ మిస్టేక్స్ ని తెలియజెప్పడం మరొకటి.

శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చీ రాగానే శుక్రవారం రోజు ఏం జరిగిందో ప్రేక్షకులకి చూపించాడు. అందులో టేస్టీ తేజ, శోభాశెట్టిల మధ్య గొడవ జరిగింది. టాస్క్ మొదలయ్యాక యావర్ తరుపున ఎవరు ఆడకపోవడం, శివాజీ కూడా యావర్ కి కాకుండా అంబటి అర్జున్ కోసం ఆడడంతో యావర్ ఫీల్ అయ్యాడు. ఇక అతడిని కన్విన్స్ చేశాడు శివాజీ. ఆ తర్వాత గౌతమ్ కృష్ణపై శివాజీ నెగెటివిటి పెట్టుకున్నాడని భావించాడు. ‌ఇలా ఒక మనిషికి టార్గెట్ చేసి చేయడం కరెక్ట్ కాదని, నేను వెళ్ళిపోతానని గౌతమ్ కృష్ణ అంటాడు. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి హాయ్ చెప్పి మొదలుపెట్టాడు నాగార్జున. వచ్చీ రాగానే శోభాశెట్టి కోసం చప్పట్లు కొట్టాడు. 'కంగ్రాట్స్ ఫర్ ది న్యూ కెప్టెన్' అండ్ ఫస్ట్ లేడీ కెప్టెన్ అంటూ ప్రశంసలు కురిపించాడు నాగార్జున. ఆ తర్వాత గెస్ట్ కార్తీని తీసుకొచ్చాడు నాగార్జున. కార్తీ నటించిన 'జపాన్' మూవీ ట్రైలర్ ని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులకి చూపించాడు నాగార్జున. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో కార్తీ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు.

ఇక హౌస్ లో ఈ వారం ఎవరి పర్ఫామెన్స్ ఏంటని చెప్తూ.. బంగారం, మట్టి, బొగ్గు అని మూడు వర్గాలుగా విభజించాడు. పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, అమర్ దీప్ లని బంగారం అని, శివాజీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్ లని మట్టి అని, అశ్వినిశ్రీ, భోలే‌ షావలి, రతికలని బొగ్గు అని నాగార్జున చెప్పాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ కృష్ణని సీక్రెట్ రూమ్ కి పిలిచి శివాజీ గురించి మాట్లాడాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.