English | Telugu
Bigg Boss 7 Telugu: గౌతమ్ కృష్ణ బండారం బయటపడిందిగా.. మరోసారి ఫెయిర్ ప్లేయర్ గా శివాజీ!
Updated : Nov 5, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం హీటెడ్ డిస్కషన్లు జరుగుతున్నాయి. శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరికైనా నాతో చెప్పుకోవల్సినవి ఉన్నాయా అని నాగార్జున అడిగాడు. ఇక అందరు సైలైంట్ గా ఉండటంతో.. సరే ఇలా కాదు కానీ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళి మీరు నాతో మాట్లాడుకునేది ఏమైనా చెప్తారా అని అనగానే.. గౌతమ్ కృష్ణ చెప్పాలని కన్ఫెషన్ రూమ్ కి వెళ్తాడు.
బీన్ బ్యాగ్ టాస్క్ గేమ్ ముందు శివాజీ గారు నేను కెప్టెన్ అని నన్ను తప్పించాలని, అందరిని మానిపులేట్ చేశాడని, అది నాకు నచ్చలేదని నాగార్జునతో గౌతమ్ కృష్ణ అంటాడు. సరే ఈ విషయం ఎవరు చెప్పారంటే అశ్వినిశ్రీ అని గౌతమ్ కృష్ణ అంటాడు. అసలు ఆ రోజు గేమ్ లో ఏం జరిగిందో వాళ్ళతో మాట్లాడదామని హౌస్ మేట్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళమంటాడు నాగార్జున. ఇక అక్కడికి వెళ్ళాక.. ఆ రోజు గౌతమ్ కృష్ణని కెప్టెన్ గా తీసేయాలని శివాజీ మీకు ఇండివిడ్యువల్ గా చెప్పి, మిమ్మల్ని మానిపులేట్ చేస్తే చేయి ఎత్తండని అందరిని అడుగుతాడు నాగార్జున. దాంతో అశ్వినిశ్రీ ఒక్కరు తప్ప హౌస్ లో ఎవరు చేయి ఎత్తరు. దీంతో గౌతమ్ కృష్ణ అశ్వినిశ్రీ చెప్పుడు మాటలు విని అలా అయ్యాడని తెలిసింది. ఒకసారి కెప్టెన్ అయ్యిన వాళ్ళు మరోసారి కెప్టెన్ కాకూడదని శివాజీ గారు చెప్పడం నచ్చలేదని నాగార్జునతో గౌతమ్ కృష్ణ అనగా.. శివాజీ అన్న ఒక్కడే చెప్పలేదు. మేం ఒక్కొక్కరం ముందు కెప్టెన్ లని తప్పించాలని అనుకున్నామని, యావర్, అర్జున్ లని కూడా తప్పించాలని అనుకున్నామని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా అదే చెప్పింది.
అంబటి అర్జున్ లేచి అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పాడు. ఆ రోజు టీమ్ అందరూ కలిసి పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు. కానీ శివాజీ గారు ఒక్కడే తీసుకెళ్ళలేదు. గౌతమ్ కృష్ణ దగ్గరికి అశ్వినిశ్రీ వచ్చి.. టీమ్ డెషిషన్ అని చెప్పకుండా శివాజీ గారు నిన్ను తీసేయాలని అందరితో చెప్పాడని చెప్పిందని చెప్పాడు. ఆ తర్వాత టీమ్ డెసిషన్ ఎందుకు? అలా డిసైడ్ అయితే నీ ఇండివిడ్యువల్ గేమ్ ఏం ఉంటుందని అశ్వినిశ్రీతో గౌతమ్ కృష్ణ అనడంతో తన నిర్ణయం మార్చుకుందని ఇదే జరిగిందని నాగార్జునతో అంబటి అర్జున్ చెప్పాడు. ఆ తర్వాత బ్లాక్ బాల్ ని స్వాప్ చేసేటప్పుడు భోలే షావలి, రతికలని అడగకుండా మీరు నలుగురు కలిసి సపరేట్ గా వెళ్ళి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని, నువ్వు భోలే షావలిని తప్పిస్తానని అందరితో చెప్పి వాళ్ళని కూడా భోలే షావలి అని చెప్పేలా చేశావని నాగార్జున అన్నాడు. దాంతో గౌతమ్ కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గౌతమ్ కృష్ణ అన్ ఫెయర్ గేమ్ ఆడుతున్నాడని, నిజాలు తెలుసుకోకుండా శివాజీ మీద నిందలు వేశాడని నాగార్జున నిరూపించాడు. ఇవన్నీ చూస్తుంటే వచ్చే వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.