English | Telugu

నా కొడుకు అర్జున్ రెడ్డి అన్న సుమ.. మనోజ్ ఏంటి అలా అనేశాడు!

ఈటీవీలో దీవాలి స్పెషల్ ఈవెంట్ గా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే ఈవెంట్ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి.. రీసెంట్ గా ఇంకో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో మంచి ఫన్నీ కంటెంట్ ఉందనే విషయం ఈ ప్రోమో చూస్తే తెలిసిపోతుంది. ఇందులో సుమని తన సుపుత్రుడు రోషన్ కనకాల ఇంటర్వ్యూ చేసాడు. "బబుల్ గం టీజర్ చూసాక మీ థాట్స్ ఏమిటి" అని రోషన్ సుమని అడిగేసరికి "నేను శంకరాభరణం సినిమాను విపరీతంగా ఇష్టపడ్డాను, అర్జున్ రెడ్డి మూవీని కూడా బాగా లైక్ చేసాను .." అని వెరైటీ ఆన్సర్ ఇచ్చేసరికి హైపర్ ఆది మధ్యలో వచ్చి "ఇంతకు మీ కొడుకు శంకరాభరణమా, అర్జున్ రెడ్డా ?" అని ఫన్నీగా అడిగాడు. "నా కొడుకు అర్జున్ రెడ్డే" అని గట్టిగ నవ్వుతూ చెప్పింది సుమ.

తర్వాత రఘు కుంచె స్టేజి మీదకు వచ్చి "నాది నక్కిలీసు గొలుసు" అనే సాంగ్ కి పాడి డాన్స్ చేసాడు. అలాగే మానస్, శ్రీ సత్య ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో వచ్చి "మన్మధ రాజా" సాంగ్ కి డాన్స్ ఇరగదీసారు. ఆ తర్వాత మంచు మనోజ్, శ్రీముఖి "ఏ" కంటెంట్ డైలాగ్స్ తో పిచ్చెక్కించారు ఆడియన్స్ ని. "ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడతాయి"..."ఇంట్లో ఫ్రిజ్ ఉందా..ఫ్రిజ్ లో అవెక్కడ మామ..." అని మనోజ్ అడిగేసరికి "పండగ రోజు పూజలు ఉంటాయి కదండీ..అందుకే పక్కన పెట్టాం" అని శ్రీముఖి అనేసరికి "మా పూజే అదండీ" అంటూ చెప్పేసరికి సుమ ఎంట్రీ ఇచ్చి "ఇదే ఆటిట్యూడ్ తో వెళ్ళిపోతే సరిపోతుంది" అనేసరికి "అరేయ్ కార్ తియ్యరా వెళ్ళిపోదాం" అని వెళ్ళిపోయాడు మనోజ్.. ఇలా ఫన్నీ ఫన్నీ కంటెంట్ తో ఈ ఈవెంట్ రాబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.