English | Telugu
Guppedantha Manasu: దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఫణీంద్ర.. అనుపమ ఏం చేయనుంది?
Updated : Nov 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -912 లో.. జగతి కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ ఆఫీసర్ గా ముకుల్ వచ్చి.. ఈ కేసులోని నిందితులని కచ్చితంగా పట్టుకుంటానని ప్రామిస్ చేస్తాడు. అది విని ఎక్కడ తమ గురించి బయట పడుతుందో అన్న టెన్షన్ లో శైలేంద్ర దేవయాని ఇద్దరు ఉంటారు. అప్పుడే వచ్చిన ధరణి పుండు మీద కారం చల్లినట్లుగా వాళ్ళకి సెటైర్ వెయ్యడంతో శైలేంద్రకి ఇంక మండుతుంది. మామయ్య గారు మిమ్మల్ని ఇద్దరిని మాట్లాడుకోకుండా చూసుకోమని ఒక టాస్క్ ఇచ్చారని ధరణి చెప్పి వెళ్ళిపోతుంది.
ఆ ముకుల్ మాట్లాడిన తీరు చూస్తుంటే భయంగా ఉందని దేవయాని అనగానే.. ఆ ముకుల్ కి మన గురించి తెలిసిన ఏం చెయ్యలేడు. అతనికి మనకి సంబంధించిన ఆధారాలు దొరకకుండా నేను చేస్తానని శైలేంద్ర అంటాడు. మరొక వైపు మహేంద్రకి రిషి కాఫీ తీసుకొని వచ్చి మాట్లాడుతాడు. అమ్మకి సంబంధించిన కేసుని ఒక స్పెషల్ ఆఫీసర్ అయిన ముకుల్ టేకప్ చేస్తున్నాడు. అతను ఎవరో కాదు అమ్మ స్టూడెంట్ అని రిషి అనగానే.. త్వరగా నేరస్తులు ఎవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష వెయ్యాలని మహేంద్ర అంటాడు. మరొక వైపు మహేంద్రకి అనుపమ ఫోన్ చేస్తుంటే.. స్విచాఫ్ రావడంతో అనుపమ టెన్షన్ పడుతూ.. అసలు మహేంద్ర ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశాడని ఆలోచిస్తుంది. అప్పుడే తన పెద్దమ్మ వచ్చి ఎందుకు అంత బాధపడుతావ్ ? నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళు కోల్పోయిన సంతోషo తిరిగి పొందు అని చెప్తుంది. మహేంద్ర కన్పించిన అప్పటి నుండి అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అనుపమ అంటుంది. ఆ తర్వాత అనుపమ కూడా ఆలోచనలో పడి నేను వెళ్తానని వాళ్ళ పెద్దమ్మకి చెప్తుంది.
మరొక వైపు వసుధార కాలేజీకీ రెడీ అయి బాతురూమ్ నుండి రిషి సర్ ఇంకా రావడం లేదని వెయిట్ చేసి త్వరగా రండని డోర్ కి ఒక స్లిప్ రాసి కార్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత రిషి వచ్చి స్లిప్ చూస్తాడు. ఇద్దరు అక్కడే ఉండి చాట్ చేసుకుంటారు. మరొక వైపు "ముందు రిషి వాళ్ళు మనకి దూరంగా మహేంద్ర వల్లే వెళ్లారు. రోజు తాగుడుకి అలవాటు అయ్యాడు" అని దేవయాని అనగానే.. నా తమ్ముడిని అలా అంటావా అంటూ విరుచుకుపడుతాడు ఫణీంద్ర. నువ్వు ఎందుకు డాడ్ కి కోపం వచ్చేలా మాట్లాడుతున్నావ్ మమ్మీ అని శైలేంద్ర కూడా దేవాయనినే అంటాడు. మరొక వైపు రిషి వసుధారలు కాలేజీ కీ వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.