English | Telugu
Rowdy Janardhana: 'రౌడీ జనార్ధన' గ్లింప్స్.. ల** కొడుకు అంటూ రెచ్చిపోయిన విజయ్!
Updated : Dec 22, 2025
గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'రౌడీ జనార్ధన' గ్లింప్స్
ఊర మాస్ అవతార్ లో విజయ్
హాట్ టాపిక్ గా ల** కొడుకు డైలాగ్
2018లో వచ్చిన 'గీత గోవిందం' తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఊరమాస్ అవతారమెత్తాడు. 'రాజావారు రాణిగారు' ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన'(Rowdy Janardhana) అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో 'రౌడీ జనార్ధన' టైటిల్ గ్లింప్స్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేకంగా గ్లింప్స్ ని ప్రదర్శించగా.. చూసి అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. (SVC59 Title Glimpse)
'రౌడీ జనార్ధన'లో మునుపెన్నడూ చూడని విధంగా ఊరమాస్ లుక్ లో విజయ్ కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహం, ఒండినిండా రక్తపు మరకలు, చేతితో కత్తితో విజయ్ కనిపించిన తీరు అదిరిపోయింది. "కళింగపట్నంలో ఇంటికో ల** కొడుకు నేను రౌడీనని చెప్పుకు తిరుగుతడు. కానీ, ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన" అంటూ విజయ్ విశ్వరూపం చూపించాడు. విజయ్ ని నెవర్ బిఫోర్ రోల్ లో రవికిరణ్ కోలా చూపించబోతున్నాడని గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసింది. అలాగే గ్లింప్స్ లో విజవుల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకున్నాయి.
Also Read: నారీ నారీ నడుమ మురారి టీజర్ రివ్యూ
అయితే ఇప్పుడు ఈ గ్లింప్స్ లోని "ఇంటికో ల** కొడుకు" అనే డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఈ పదాన్ని తెలుగు సినిమాల్లో బాగా ఉపయోగిస్తున్నారు. ఆ మధ్య నాని 'ది ప్యారడైజ్' మూవీ గ్లింప్స్ లోని "ఇది ఒక ల** కొడుకు కథ" అనే మాట కూడా వైరల్ అయింది. దీంతో ఇప్పుడు ఈ రెండు వీడియోలను పోలుస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగే అవకాశముంది.