English | Telugu
హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీపై మంచు మనోజ్ ఫైర్!
Updated : Dec 23, 2025
దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్ ల గురించి ప్రముఖ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన విషయం కరెక్టే కానీ, మాట్లాడిన విధానం తప్పని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన కామెంట్స్ ని పూర్తిగా ఖండిస్తున్నారు.
చిన్మయి, అనసూయ వంటి వారు ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎవరెలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది వారి వ్యక్తిగత విషయమని, ఫలానా డ్రెస్ వేసుకోవాలని చెప్పే రైట్ ఎవరికీ లేదని అన్నారు. అంతేకాదు, మహిళలకు చీర కట్టుకోమని చెబుతున్న ఆయన.. మరి సంప్రదాయాన్ని గౌరవిస్తూ పంచె కట్టుకున్నాడా? అని ప్రశ్నించారు.
Also Read: మళ్ళీ సింగర్ గా మారిన బాలయ్య.. ఏ సినిమా కోసమో తెలుసా..?
ఇక తాజాగా శివాజీ కామెంట్స్ ని మంచు మనోజ్ కూడా ఖండించాడు. "ఈ రకమైన కామెంట్స్ తీవ్ర నిరాశను కలిగిస్తాయి. మహిళల దుస్తుల గురించి మాట్లాడటం సరైనది కాదు. గౌరవం అనేది వ్యక్తిగత ప్రవర్తనతో రావాలి.. మహిళల దుస్తుల గురించి మాట్లాడి, వారిని అవమానించడం ద్వారా కాదు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుల తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను." అని మనోజ్ రాసుకొచ్చాడు.