English | Telugu

అత‌నికి అంత సీన్ లేదు.. వేణుస్వామి జ్యోతిషంపై కౌంట‌ర్ ఇచ్చిన ప్ర‌గ‌తి!

- ప్ర‌గ‌తిని టార్గెట్ చేసిన వేణుస్వామి
- వేణుస్వామితో పూజ‌లు
- ఏషియ‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో ప్ర‌గ‌తికి నాలుగు మెడ‌ల్స్‌

టాలీవుడ్‌లోని ప్ర‌ముఖుల విష‌యంలో అనేక సార్లు వివాదాల్లో చిక్క‌కున్న వేణుస్వామి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. సీనియ‌ర్ న‌టి ప్ర‌గ‌తి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఒక బంగారు, మూడు రజత పతకాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విజయం వెనుక తన పూజల ప్రభావం ఉందని జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. ఈ విషయంపై స్పందించిన ప్రగతి, పూజలు చేయించుకున్న విషయం నిజమేనని, తన మెడల్స్ వెనుక అసలైన కారణం కష్టపడి చేసిన సాధన మాత్రమేనని స్పష్టం చేశారు. అప్పటి పూజల ఫోటోలు ఇప్పుడు వైరల్ చేయ‌డం స‌రికాద‌ని ఆమె అంటున్నారు.


కెరీర్ ఆరంభం నుంచే విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్ర‌గ‌తి. నటనతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ విజ‌యాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల టర్కీలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో ఆమె ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించారు. మొత్తంగా నాలుగు మెడల్స్ గెలుచుకోవడం ద్వారా, ఒకప్పుడు తన వయస్సు గురించి, ఫిట్‌నెస్ గురించి విమర్శలు చేసిన వారికి తన ప్రతిభతో సమాధానం చెప్పారు.


ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. ప్రగతి తన కెరీర్ బాగుండాలని, రెజ్లింగ్‌లో ఎదగాలని తన వద్ద పూజలు చేయించుకుందని, ఆ పూజల ఫలితంగానే ఆమెకు ఈ నాలుగు మెడల్స్ వచ్చాయని వేణుస్వామి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు ప్ర‌గ‌తి. వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్న విషయం నిజమేనని, అయితే అది సుమారు రెండున్నరేళ్ల క్రితం తాను మానసికంగా చాలా కష్టమైన దశలో ఉన్నప్పుడు జరిగిందని వివరించారు. ఆ పూజల వల్ల తన జీవితంలో గానీ, క్రీడల్లో గానీ ఎలాంటి ప్రత్యక్ష ఫలితం కనిపించలేదని స్పష్టంగా చెప్పారు.


ఆ పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇప్పుడు బయటపెట్టి, తన విజయం మొత్తానికి తానే కారణమన్నట్లు వేణుస్వామి చెప్పుకోవడాన్ని ప్రగతి తప్పుబట్టారు. తన విజయాన్ని వేణుస్వామి ఖాతాలో వేసుకోవడాన్ని ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని అన్నారు ప్ర‌గ‌తి. జిమ్‌లో చెమట చిందించి, శారీరకంగా, మానసికంగా పోరాడి సాధించిన విజ‌యానికి జ్యోతిష్యాన్ని జోడించ‌డం సరికాదని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.