ఘనంగా జరిగిన సల్మాన్ ఖాన్ 60 వ పుట్టిన రోజు.. పెళ్లి న్యూస్ ఇదే
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని చరిష్మా 'సల్మాన్ ఖాన్' సొంతం. బాలీవుడ్ కండల వీరుడుగా, సల్లు భాయ్ గా అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే సల్మాన్ సృష్టించని రికార్డు లేదు. లవ్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, రొమాంటిక్, స్పై థ్రిల్లర్ మూవీస్ లో సుదీర్ఘ కాలం నుంచి చేస్తు యావత్తు భారతీయ సినీ ప్రేమికులని అలరిస్తూ వస్తున్నాడు. ఈ రోజు సల్మాన్ పుట్టిన రోజు. దీంతో అరవై సంవత్సరంలోకి అడుగుపెట్టిన సల్మాన్ కి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రేమికులు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.