English | Telugu

అటు అమ్మ ప్రేమ‌‌.. ఇటు భార్య ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -148 లో....రామలక్ష్మి, సీతాకాంత్ లు బారసాల ఫంక్షన్ కి వెళ్తుంటే.. శ్రీలత ఆపాలని కళ్ళు తిరిగిపడిపోయినట్లు నటిస్తుంది. దాంతో వాళ్ళు వెళ్లకుండా ఆగిపోతారు. టాబ్లెట్ వేసుకోలేదు నాన్న అందుకే ఇలా జరిగిందని సీతాకాంత్ తో శ్రీలత అంటుంది. దాంతో టాబ్లెట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటు శ్రీవల్లిని సీతాకాంత్ అంటుంటే.. ఆ డ్యూటీ రామలక్ష్మిదని శ్రీవల్లి అంటుంది. ఇక రామలక్ష్మిపై సీరియస్ అవుతాడు సీతాకాంత్ . అమ్మని జాగ్రత్త గా చూసుకోండి అంటూ సీతాకాంత్ వెళ్ళిపోతాడు.

శ్రీలత కాళ్ళు రామలక్ష్మి నొక్కుతుంటే.. చూసావా నా ప్లాన్ ఎలా ఉందోనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత మేమ్ వెళ్లకుండా ఉండడానికి ఇదంతా చేసారా అని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి కోపంగా శ్రీలత కాళ్ళు గట్టిగా నొక్కుతుంది‌‌. ఏయ్ ఏం చేస్తున్నావ్.. నొప్పిగా ఉందని శ్రీలత అంటుంది‌. చూసావా నన్ను ఒక్క నిమిషం కూడా నీ కాళ్ళు పట్టించలేకపోయావని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు ఆఫీస్ లో సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఆలోచిస్తుంటాడు. పాపం తను ఎప్పుడు సరదాగా బయటకు వెళదామన్నా.. ప్రతిసారీ ఇలా జరుగుతుందని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు సీతాకాంత్ గురించి రామలక్ష్మి ఆలోచిస్తుంది‌. అక్కడ తన డైరీ ఉంటుంది. అది ఓపెన్ చేసి చదవాలని అనుకుంటుంది. ఒకవేళ నన్ను ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూస్తున్నానని రాసి ఉంటే మళ్ళీ బాధపడతానని రామలక్ష్మి చదవకుండా ఆగుతుంది.

ఆ తర్వాత సందీప్ ని ఎలాగైనా జనరల్ మేనేజర్ ని చెయ్యాలని అనుకోని శ్రీవల్లి, సందీప్ లకి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. మరొక వైపు సీతాకాంత్ లాయర్ ని పిలిపించి ధనకి ఇవ్వాలసింది ఫైల్ రూపంలో రెడీ చేసి ధనకి ఇస్తాడు. ఇదంతా నీ కష్టం మీద నువ్వు సొంతంగా డెవలప్ అవ్వని సీతాకాంత్ అంటాడు. దాంతో సిరి, ధనలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.