English | Telugu

పిల్లలు చనిపోతున్నారు...బెట్టింగ్ యాప్స్ ఆపు శివజ్యోతక్క

బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతుండడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇన్ని జీవితాలు నాశనం అవుతున్నా సెలబ్రిటీలు మాత్రం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వాళ్లలో బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి గురించి చాలా చెప్పుకోవాలి. శివజ్యోతి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ని ఆపకపోవడం పై యూట్యూబర్ యువసామ్రాట్ రవి కౌంటర్ ఇచ్చాడు.

బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద సునామీలా విరుచుకుపడుతున్నారు యువసామ్రాట్ రవి. యూట్యూబర్ హర్షసాయి ఇష్యూతో హాట్ టాపిక్‌గా మారిన యువసామ్రాట్ రవి.. యాంకర్ శివజ్యోతి పై వీడియో రిలీజ్ చేసాడు. ‘ శివజ్యోతక్కా.. మంచి ఫిల్టర్ చెప్పక్కా.. ఈమధ్య వీడియోల్లో కర్రిగా కనిపడుతున్నా.. నీలాగ తెల్లగా కనిపించాలా’ అంటూ ఆమె ఫేస్ కి ఫిల్టర్లు వేసి వీడియోస్ చేస్తుందంటూ సెటైర్ వేసాడు. ఆమె బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇందులో శివజ్యోతి.. "నాలాగే మీరు కూడా బెట్టింగ్‌లో డబ్బులు పెట్టండి.. 2 వేలు పెడితే.. పాతికవేలు, మూడు వేలు పెడితే 35 వేలు, 4 వేలు పెడితే.. ఇలా చెప్తూ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసేస్తుంది. ఈమె బెట్టింగ్ వ్యవహారాన్ని బయటపెట్టిన యువ సామ్రాట్ రవి సైటైర్లు వేస్తూ.. ‘ఏంటక్కా.. ఫిల్టర్ గురించి మాట్లాడమంటే బెట్టింగ్ అంటావూ.. నువ్వు కూడా సేమ్ బ్యాచా అక్కా.. ? ఇవన్నీ ఇక బంద్ చేయండి. పిల్లలు చనిపోతున్నారు ..అర్ధం చేసుకోండ్రీ.. బయట పబ్లిక్ రియాక్షన్ ఇంకా గలీజ్‌గా ఉంటుంది. జైహింద్’ అంటూ శివజ్యోతికి కౌంటర్ ఇచ్చాడు.