English | Telugu
మహిళలు ఎదగాలంటే షార్ట్ కట్ క్యాస్టింగ్ కౌచ్
Updated : Jul 13, 2024
బిగ్ బాస్ ఫేమ్ నోయల్ భార్య ఎస్తర్ నోరోన్హా గురించి అందరికి తెలుసు. సంస్కార్ కాలనీ, భీమవరం బుల్లోడు, టెనెంట్, ది వెకెంట్ హౌస్ వంటి చిత్రాలతో ఎస్తర్ నోరోన్హా బాగా క్రేజ్ తెచ్చుకుంది. బోల్డ్ సీన్లలో ఎక్కువగా మెరిసిన ఈ భామకి సినిమాలో అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి.
అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకొచ్చింది ఎస్తర్. మహిళలపై వేధింపులు సమాజంలో అన్నిచోట్లా ఉన్నాయని కానీ ఇండస్ట్రీలో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తుందని ఎస్తర్ చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో తొందరగా ఎదగాలనే కోరికతో ఏం చేయడానికైనా సిద్ధపడితే అడ్వాంటేజ్ తీసుకుంటారని, తొందరగా పైకి రావాలని కోరుకునే వారికి అదే షార్ట్ కట్ అని ఎస్తర్ అంది.
ఈ ఇండస్ట్రీ కాదు ఎందులోనైనా మహిళలపై వేధింపులు సహజం కానీ ఇక్కడే ఎక్కువగా జరగడానికి కారణం ఇక్కడున్న పరిస్థితులేనని ఎస్తర్ అంది. అవకాశాల కోసం ఏం చేయగలవు అనే వాళ్లు, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్లు ఉంటారని అంది. నా దారిలో నేను వెళతాను అనుకునే వారిని ఎవరూ బలవంత పెట్టరని, ఆ ఛాయిస్ మాత్రం మనకు ఉందని చెప్పింది. తనవరకు తను టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను నమ్ముకుంటానని ఎస్తర్ చెప్పుకొచ్చింది. తన టాలెంట్ ద్వారా వచ్చే గుర్తింపునే కోరుకుంటానని ఎస్తర్ చెప్పుకొచ్చింది. అయితే తను చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.