English | Telugu

నొప్పిని తట్టుకుంటే ఏదైనా చేయగలం.. మీరు కూడా సపోర్ట్ చేయండి!


షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను యూట్యూబర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసాడు మూవీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. బిగ్ బాస్ కి వెళ్ళాడు. దీప్తి సునాయానాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. తర్వాత దీప్తి వదిలేసింది. ఇక షన్ను కూడా చాలా ఇష్యుస్ లో పట్టుబడడం వంటివి జరిగాయి. ఆ తర్వాత అసలు షన్ను కనిపించడమే మానేసాడు. అలాంటి షన్ను రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. "మీకు కూడా మీ కుటుంబంలో ఎవరైనా స్నేహితుడు లేదా సిఏ విద్యార్థి ఉన్నట్లయితే అతను సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మీ ఫ్రెండ్స్ , ఫామిలీ మెంబర్స్ వారిని ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి. సిఏ చదివేవారికి కాదు అందరికీ సపోర్ట్ అవసరం.

నాకు చాలాసార్లు చావాలని అనిపించేది. కానీ ధైర్యంగా ఉండడం నేర్చుకున్నా. ఎన్ని సమస్యలు వచ్చినా నేర్చుకోడానికి ప్రయత్నిస్తాను కానీ ఒక్కసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోరు కుటుంబం తప్ప ... దయచేసి ఏ సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కోండి .. నొప్పిని తట్టుకుంటే ఆ దేవుడే మీకు మంచి మార్గం చూపిస్తాడు. నాకు అర్ధమైన విషయం మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని " అంటూ హితవు చెప్పాడు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం అంటూ ఈ పోస్ట్ లో తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.