English | Telugu

Guppedantha Manasu :‌ యాక్షన్ ఎపిసోడ్ చూపించిన వసుధార.. రంగాతో మళ్ళీ ఇంటికి రిటర్న్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1125 లో....వసుధారని రౌడీ లు కిడ్నాప్ చేసి.. చంపాలని చూస్తారు. అప్పుడే రంగా వస్తాడు. దాంతో వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రౌడీలు రంగాని కొట్టి వేరే పక్క గదిలోకి తీసుకొని వెళ్తారు. రంగా గదిలో నుండి చూస్తుంటాడు. వసుధార కుడా రంగాని చూస్తుంటుంది. రంగా తప్పించుకోకుండా ఇద్దరు రౌడీలు గట్టిగా పట్టుకుంటారు. వసుధారని కత్తితో పొడవడానికి రౌడీ వస్తుంటే.. చంపెయ్ అని రంగా అనగానే వసుధార షాక్ అవుతుంది.

అవును మేడమ్.. భయపడేవాళ్ళకి బ్రతికే హక్కు లేదు.. అందుకే అంటున్నానని రంగా అంటాడు. ఎదరు తిరగండి అంటూ వసుధారకి రంగా దైర్యం చెప్తాడు. దాంతో వసుధార సివంగిలాగా రౌడీలపై విరుచుకుపడుతుంది. రౌడీ కలు తను కొట్టె దెబ్బలకు పారిపోతారు. ఆ తర్వాత సూపర్ మేడమ్ చాలా బాగా ఫైట్ చేశారు. చాలా రోజులకి ఒక యాక్షన్ చూసానని రంగా అంటాడు. ఆ తర్వాత వసుధార కోపంగా వెళ్లిపోతుంటే.. రంగా ఆపుతాడు.‌మీరు ఎందుకు నా వెంట వస్తున్నారు. నేను ఏమైపోయినా మీకు సంబంధం లేదని వదిలేసి వెళ్లారు కదా అని వసుధార అనగానే రంగా రిక్వెస్ట్ చేస్తాడు.

ఆ తర్వాత అది కాదు మేడమ్ మీరు అలా ఇంట్లో ఉండడం ఊళ్ళో వాళ్ళు వేరే అనుకుంటున్నారని రంగా అంటాడు. అయితే మీ ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్ కానీ మీ ఇంట్లో పెంట్ హౌస్ ఉంది కదా.. అందులో ఉంటా అని వసుధార అనగానే.. రంగా సరే అంటాడు. ఆ తర్వాత రంగా దగ్గరికి సరోజ వచ్చి.. వచ్చావ బావ నాకు తెలుసు, నువ్వు వస్తావని దాని పీడ విరగడ అయిందని సరోజ అంటుంది. అప్పుడే వసుధార ఇంట్లో నుండి సరోజ ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది. దాంతో సరోజ షాక్ అవుతుంది. మేడమ్ మీకు ఈ చీర బాగుందని రంగా అనగానే.. ఇది సరోజ ఇచ్చిందని వసుధార అంటుంది. దాంతో సరోజ కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.