English | Telugu

ప్రభాస్‌ బంపర్‌ ఆఫర్‌.. కొత్త డైరెక్టర్స్‌కి టైమ్‌ వచ్చింది!

- టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ కోసం కొత్త ప్రోగ్రామ్‌

- టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్ల నేతృత్వంలో పోటీ

- 90 రోజులపాటు జరిగే షార్ట్‌ ఫిలింస్‌ కాంపిటీషన్‌


సినిమా రంగానికి రావాలని, హీరోలుగా, టెక్నీషియన్స్‌గా తమ టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఇక డైరెక్టర్ల విషయానికి వస్తే.. ప్రేక్షకుల్ని మెప్పించేందుకు కొత్త తరహా కథలను సిద్ధం చేసుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే తమ కథలను వినిపించేందుకు సరైన ప్లాట్‌ఫామ్‌ దొరక్క డైరెక్టర్లు అవ్వకుండానే ఇండిస్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయిన వారు చాలా మంది ఉన్నారు.

టాలెంట్‌ ఉన్న అలాంటి కొత్త వారి కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఒక ఎక్స్‌లెంట్‌ ప్లాన్‌తో వస్తున్నారు. అందులో భాగంగానే 'ది స్క్రిప్ట్‌ క్రాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌'ను ప్రకటించారు. ఇది ఖచ్ఛితంగా కొత్త డైరెక్టర్లకు బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. 'ప్రతి కలకూ ఒక అవకాశం దక్కాలి.. మీ కథలే మీ కెరీర్‌ను మారుస్తాయి' అని ప్రభాస్‌ ఇచ్చిన పిలుపు ఇండిస్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రభాస్‌ తలపెట్టిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ సందీప్‌రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌, హను రాఘవపూడి కూడా జత కలిశారు. ఈ ఆలోచన కొత్తగా డైరెక్టర్స్‌ అవ్వాలనుకునే వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. 'షార్ట్‌ ఫిలిం మేకింగ్‌ అనేది దర్శకుడిగా మీ మొదటి అడుగు' అని సందీప్‌రెడ్డి అన్నారు. 'ఒక షార్ట్‌ ఫిలిం చూసిన తర్వాతే అనుదీప్‌లోని టాలెంట్‌ను గుర్తించగలిగాను' అని నాగ్‌ అశ్విన్‌ అన్నారు.

ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు 2 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న షార్ట్‌ ఫిలిం పంపాలి. దాదాపు 90 రోజుల పాటు జరిగే ఈ పోటీలో ఆడియన్స్‌ ఓట్లు, రేటింగ్స్‌ ఆధారంగా విన్నర్స్‌ను ఎంపిక చేస్తారు. పోటీలో గెలిచిన టాప్‌ 15 మంది ఫిలిం మేకర్స్‌కి 'క్విక్‌ టీవీ' బ్యానర్‌పై గంటన్నర నిడివి ఉండే సినిమాను చేసే గొప్ప అవకాశం కల్పించబోతున్నారు.

ఈ సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ వాళ్లే చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్‌ డైరెక్టర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వేదిక వారికి ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. ప్రభాస్‌ కల్పించిన ఈ అవకాశాన్ని కొత్త డైరెక్టర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఈ ప్రక్రియ ద్వారా కొత్త డైరెక్టర్లకు టైమ్‌ వచ్చిందని చెప్పొచ్చు. ఈ కాంపిటీషన్‌ ద్వారా ఎంత మంది టాలెంటెడ్‌ డైరెక్టర్లు ఇండిస్టీలోకి అడుగుపెట్టబోతున్నారో త్వరలోనే తెలుస్తుంది.