English | Telugu

సందీప్‌రెడ్డికి డార్లింగ్ బర్త్‌డే విషెస్‌.. పోస్ట్‌లో ఏముందంటే?

అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌, యానిమల్‌ వంటి వయొలెంట్‌ హిట్స్‌ తర్వాత సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్‌ చేస్తున్న సినిమా ‘స్పిరిట్‌’. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ఫస్ట్‌టైమ్‌ సినిమా చేస్తున్న సందీప్‌.. మరోసారి ఓ పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. జనవరి వరకు మొదటి షెడ్యూల్‌ జరుగుతుందని తెలుస్తోంది.

‘స్పిరిట్‌’ చిత్రంలో ప్రభాస్‌ను పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రజెంట్‌ చేస్తున్నారు సందీప్‌. అతని సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి డిఫరెంట్‌ స్టైల్‌లో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. డిసెంబర్‌ 25 సందీప్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ ఒక పోస్ట్‌ పెట్టారు ప్రభాస్‌. ఇప్పుడా పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తను చేస్తున్న సినిమాల గురించి పోస్ట్‌ పెట్టే అలవాటు ప్రభాస్‌కి లేదు. కానీ, ‘స్పిరిట్‌’ విషయంలో తొలిసారి ఓ పోస్ట్‌ పెట్టడం, అది కూడా సందీప్‌రెడ్డి పుట్టినరోజున సినిమా గురించి తన ఒపీనియన్‌ చెప్పడం అనేది ఆసక్తికరంగా మారింది. బర్త్‌డే విషెస్‌తోపాటు Can’t wait for everyone to witness what you’re creating అని క్యాప్షన్‌ ఇవ్వడం చూస్తుంటే.. ‘స్పిరిట్‌’ చిత్రంపై ప్రభాస్‌ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతుంది.