English | Telugu
వచ్చే నెలలో కార్తికేయ విడుదల
Updated : Apr 18, 2014
"స్వామి రారా" చిత్రం తర్వాత నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం "కార్తికేయ". వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ... "ప్రజలకు చికిత్స అందించడానికి వెళ్ళిన వైద్య బృందం ఓ దేవాలయానికి సంబంధించిన విషయంలో ఎందుకు కలుగజేసుకుందనేది ప్రధానాంశం. ఆద్యంతం అలరిస్తూ... ఉత్కంటభరితంగా సినిమా సాగుతుంది" అని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేసి, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు.