English | Telugu

అమలా విజయ్ ల పెళ్లి విశేషాలు

హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు విజయ్ లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. విజయ్ వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అని ప్రకటించిన అమలా వివాహం త్వరలోనే జరగనుందని తెలిసింది. వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిసింది. ఈ విషయంపై అమలా తల్లి కూడా ఓ సందర్భంలో.... ప్రస్తుతం అమలా చేస్తున్న అని సినిమాలు పూర్తయిన తర్వాతే పెళ్లి చేయాలనుకుంటున్నాం. వీరి ప్రేమ విషయం నాకు నాలుగు నెలల క్రితమే తెలిసింది. గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతుంటే అనుమానం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కానీ అమలా బాధ్యత రాహిత్యంగా ఉంటే భయపడేవాళ్ళమని, కానీ అమలా తన వృత్తి పట్ల బాధ్యతగా ఉండటం మమ్మల్ని ఆనందపరిచింది. నిశ్చితార్థం కేరళలో, చెన్నైలో పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పారు.