English | Telugu

ఇసుక తుఫానులో కోహ్లీ ప్రియురాలు

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ఇసుక తుఫాను ముంచెత్తాలని చూసిందట. ఈ అమ్మడు ప్రస్తుతం "ఎన్ హెచ్ 10" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రాజస్తాన్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ జరుగుతుండగా ఇసుక తుఫాను వచ్చిందట. ఇసుక తుఫాను వచ్చినప్పటికీ కూడా ఎదో ఒక విధంగా అందరం క్షేమంగా బయటపడ్దామని అనుష్క శర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న కూడా అనుష్క ఇంకా భయపడుతూనే ఉందని తన సన్నిహితులు చెపుతున్నారు. మరి ఈ అమ్మడికి విరాట్ ఎలాంటి ధైర్యం ఏం చెబుతాడో చూడాలి.