English | Telugu

ట్విట్టర్‌లో సారీ చెప్పిన రాజమౌళి

ఆదివారం జరిగిన ‘అల్లుడు శీను’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న దర్శకుడు రాజమౌళి ఒక సినిమా పేరు చెప్పబోయి మరో సినిమా పేరు చెప్పారు. అది విని ఆ సభలో వున్నవాళ్ళందరూ ఇందేంట్రా దేవుడా అనుకున్నారు. తాను చేసిన తప్పు ఇంటికెళ్ళాక గుర్తొచ్చిన రాజమౌళి ట్విట్టర్లో సారీ చెప్పారు. టాగోర్ అనడానికి బదులు స్టాలిన్ అని చెప్పడంపై రాజమౌళి ట్విటర్ లో వివరణ ఇచ్చారు. ఒక సినిమా పేరు చెప్పబోయి మరో సినిమా పేరు చెప్పినందుకు రాజమౌళి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో క్షమాపణలు చెప్పారు. ‘అల్లుడు శీను’ ఆడియో కార్యక్రమంలో నేను టాగోర్ కు బదులు స్టాలిన్ అన్నాను. నన్ను మన్నించండి అంటూ సారీ చెప్పారు.